Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన మంత్రి జన‏ధన్ ఖాతాదారులకు గమనిక.. ఆ లింక్ చేయకపోతే.. రూ.2.30 లక్షలు మిస్సయినట్టే..

ప్రధాన మంత్రి జన‏ధన్ యోజన పథకంలో మీకు అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే ఈ వార్త. 2021 మార్చి 31లోగా ప్రధాన మంత్రి జన‏ధన్ అకౌంట్లకు

ప్రధాన మంత్రి జన‏ధన్ ఖాతాదారులకు గమనిక.. ఆ లింక్ చేయకపోతే.. రూ.2.30 లక్షలు మిస్సయినట్టే..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 08, 2021 | 8:49 AM

ప్రధాన మంత్రి జన‏ధన్ యోజన పథకంలో మీకు అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే ఈ వార్త. 2021 మార్చి 31లోగా ప్రధాన మంత్రి జన‏ధన్ అకౌంట్లకు వినియోగదారుల ఆధార్ కార్డు నంబరును అనుసంధానం చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ప్రతి అకౌంట్‏కు ఆ ఖాతా యొక్క వినియోగదారుడి పాన్ నంబర్ మరియు ఆధార్ నంబర్ మార్చి 31లోపు అనుసంధానం అయి ఉండాలి.. లేకపోతే 2.30 లక్షల రూపాయాల ప్రయోజనాన్ని అందించలేమని స్పష్టం చేసింది.

ప్రధాన్ మంత్రి జన‏ధన్ యోజన ద్వారా ఇప్పటివరకు 41 కోట్లకు పైగా ప్రజలు లబ్ది పొందారు. ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ స్కీంకు మొత్తం జన‏ధన్ ఖాతాల సంఖ్య 41.75 కోట్లకు పెరిగింది. 2014లో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ జన‏ధన్ యోజన పథకాన్ని ప్రకటించగా.. అదే ఏడాది ఆగస్టు 28న ఈ స్కీం ప్రారంభమయ్యింది.

జన‏ధన్ స్కీంలో రూ.2.30 భీమా పొందడం.. ☞ జన‏ధన్ ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతోపాటు రుపే కార్డు అందించబడుతుంది. ☞ ఈ డెబిట్ కార్డులో దాదాపు లక్ష రూపాయాలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఉచితంగా లభిస్తాయి. ☞ ఓపెన్ జనధన్ ఖాతాలపై ప్రమాద భీమాను 2018లో ఆగస్టు 28 తర్వాత ఆ అమౌంట్ విలువను రూ.2 లక్షలకు పెంచారు. ☞ ఇవే కాకుండా ఈ కార్డులో రూ.30.000 వరకు ఉచిత జీవిత భీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ భీమా 2014 ఆగస్ట్ 15 నుంచి 2015 జనవరి 31 మధ్యలో అకౌంట్స్ ఓపెన్ చేసిన జనధన్ వినియోగదారులకు ఈ అవకాశం లభిస్తుంది.

జనధన్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడం.. ☞ జనధన్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును ఆన్ లైన్లో లింక్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్‏కు లాగిన్ కావాల్సి ఉంటుంది. ☞ లాగిన్ అయిన తర్వాత మీకు ఆధార్ నంబర్ లింక్ అనే ఆప్షన్ కన్పిస్తుంది. ☞ ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకపోతే, నేరుగా బ్యాంకుకు వెళ్లి అకౌంటును ఆధార్‏తో లింక్ చేయాలి. ☞ అందుకోసం ఈ పాస్ బుక్, ఆధార్ కార్డు యొక్క జీరాక్స్ కాపీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలావరకు బ్యాంకులు వినియోగదారుల అకౌంట్లకు ఆధార్ తో మేసేజ్ ద్వారా కూడా లింక్ చేస్తున్నాయి.

జనధన్ ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్.. ☞ జనధన్ ఖాతా ఓపెన్ చేయడానికి.. మీ యొక్క ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, వీటితోపాటు కెవైసీకి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. ☞ ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ముందుగా బ్యాంక్ అకౌంటును తెరవవచ్చు. ఇందులో మీ ఒరిజినల్ ఫోటోతోపాటు మీ సంతకం కూడా అవసరం ఉంటుంది. ☞ ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ☞ పది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
మారుతి నుంచి సూపర్‌ మైలేజీతో కొత్త తరం కారు.. ధర చౌకగా ఉండనుందా?
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
వేసవిలో యాలకులు తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయం తెలుసుకోండి
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని
విజయంలో విలన్.. ఓటమిలో హీరో.. చెన్నై ఫ్యాన్స్‌కు షాకిస్తోన్న ధోని