AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Rates: పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుందంటే..?

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నాయనే విషయం మీకు తెలిసిందే. అయితే వీటి వల్ల కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రతీ లీటర్‌పై ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. వీటి వివరాలు..

Petrol Rates: పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్సులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత ఆదాయం వస్తుందంటే..?
petrol
Venkatrao Lella
|

Updated on: Apr 08, 2026 | 12:51 PM

Share

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రైవేట్ పెట్రోలియం సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఇక ప్రభుత్వ రంగ పెట్రోలియం సరఫరా సంస్థలు కూడా ప్రీమియం పెట్రోల్, కమర్షియల్ డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు, సెస్‌లు, వ్యాట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తోంది. ప్రతీ లీటర్ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి ఆదాయం వస్తుండగా.. వ్యాట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తోంది. రాష్ట్రాలు ఒక్కో విధంగా వ్యాట్ వసూలు చేస్తూ ఉంటాయి. దీంతో రాష్ట్రాలను బట్టి పెట్రోల్ ధరల్లో మార్పులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు స్వల్పంగా విధిస్తున్నాయి.

కేంద్రానికి ఆదాయం ఎంత..?

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను విధించడం ద్వారా కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. 2022 ఆర్ధిక సంవత్సరంలో తొలి 9 నెలలలో పెట్రోలియం రంగం నుంచి ప్రభుత్వానికి రూ.5.45 లక్షల ఆదాయం వచ్చింది. వీటిల్లో రూ.3.08 లక్షల ఆదాయం కేంద్రానికి రాగా.. మిగిలిన ఆదాయం రాష్ట్రాలకు కేటాయించింది. 2023లో పార్లమెంట్‌లో ఓ ప్రశ్నగా సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే ఇంధనం ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుందని అర్ధమవుతుంది.

రాష్ట్రాలకు ఎంత వస్తుందంటే..?

వ్యాట్‌ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదాయం సమకూరుతుంది. 2024-25,2025-26 తొలి ఆరు నెలల్లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ల వల్ల రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరింది. 2024-25లో రాష్ట్రాలకు రూ.3,02,058 కోట్లు, 2025-26 మొదటి అర్ధభాగంలో రూ.1,46,892 కోట్ల ఆదాయం వచ్చింది. మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌కు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ఇక తెలంగాణకు 2024-25లో రూ.15,515 కోట్లు, ఏపీకి రూ.15,970 కోట్ల ఆదాయం లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం రూ.13 నుంచి రూ.3కి, డీజిల్‌పై సున్నాకి తగ్గించింది. దీని వల్ల సామాన్యులకు ప్రయోజనం లేకపోయినప్పటికీ.. కంపెనీలకు బెనిఫిట్ జరిగింది. ముడి సరుకు ధరలు అంతర్జాతీయ స్థాయిలో పెరగడం, సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడటంతో కంపెనీలపై అదనపు భారం పడుతోంది. దీంతో కంపెనీలకు ఉపయోగపడేలా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు తాజాగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దానికి రెండు వారాల పాటు బ్రేక్ పడటం, హార్ముజ్ జలసంధిని తెరించేందుకు ఇరాన్ ఓకే చెప్పడంతో ముడి చమురు ధరలు తగ్గాయి.

Follow Us
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
మర్యాద కోసం ’అవును‘ చెప్తే ఏం జరుగుతుందో తెలుసా
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
కిచెన్ మరకల కోసం ఖరీదైన క్లీనర్లు అక్కర్లేదు.. నిమ్మతొక్కతో
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
డైరీలో రాసుకున్నట్లే 4 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ నయా స్టార్
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
అన్న క్యాంటీన్లపై ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఈ నెల 15 నుంచి..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..
ఈవారం ఓటీటీల్లో 20కు పైగా కొత్త సినిమాలు..
ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే!
ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే!
అరటిపండు vs ఖర్జూరం.. తక్షణ శక్తి కోసం ఏది తినాలి..?
అరటిపండు vs ఖర్జూరం.. తక్షణ శక్తి కోసం ఏది తినాలి..?
ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్
ఓడినా నంబర్ వన్ స్థానంలోనే రాజస్థాన్.. హైదరాబాద్‌కు జాక్‌పాట్
ఈ సమయంలో బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్
ఈ సమయంలో బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!
సూర్యవంశీ ‘గోల్డెన్ డక్’.. చిన్నపిల్లలా చిందులేసిన కావ్యపాప..!