AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soundarya : ఆ సినిమా నన్ను అన్నీ రకాలుగా పరీక్ష పెట్టింది.. సౌందర్య పాత వీడియో వైరల్..

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సహజ సౌందర్యం, అద్భుతమైన నటనతో మెప్పించింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ చాలా సంవత్సరాలు అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

Soundarya : ఆ సినిమా నన్ను అన్నీ రకాలుగా పరీక్ష పెట్టింది.. సౌందర్య పాత వీడియో వైరల్..
Soundarya
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 2:35 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో, సహజ సిద్ధమైన అందంతో ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య. వైవిధ్యమైన పాత్రలతో దాదాపు దశాబ్ద కాలం పాటు సౌత్ ఇండస్ట్రీని ఏలిన అగ్ర కథానాయిక. సహజ సౌందర్య, ఆకట్టుకునే నటనతో నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో ‘అమ్మోరు’ (1995) అత్యంత ప్రధానమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ భక్తిరస, గ్రాఫిక్స్ వండర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో భక్తురాలిగా సౌందర్య నటన చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఒక పాత ఇంటర్వ్యూలో సౌందర్య పంచుకున్న ఆసక్తికర విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ఆ ఇంటర్వ్యూలో సౌందర్య మాట్లాడుతూ.. “అమ్మోరు సినిమాలో ఒక్క సీన్ అని కాదు, దాదాపు అన్ని సీన్లు నాకు ఒక పరీక్షలాగే అనిపించాయి. ప్రతి షాట్ ఎంతో కష్టంతో, భావోద్వేగాలతో కూడుకున్నది” అని తెలిపారు. సినిమాలో అత్తమామల చేతిలో, విలన్ కోట శ్రీనివాసరావు చేతిలో ఆమె పాత్ర పడే కష్టాలు, ఆపై అమ్మవారిని వేడుకునే ఘట్టాలు ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి. వాటన్నింటినీ తెరపై పండించడం ఒక నటిగా తనకు సవాలుతో కూడుకున్న విషయమని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ఆ ఫోన్ ఎపిసోడ్ సీన్ నాకు చాలా ఇష్టం:

సినిమా మొత్తంలో తనకు బాగా నచ్చిన ఒక ప్రత్యేకమైన సీన్ గురించి సౌందర్య ఈ వీడియోలో ప్రస్తావించారు. “సినిమాలో ఒక ఫోన్ ఎపిసోడ్ ఉంటుంది. నా భర్త (సురేష్) అమెరికా లేదా బయటి ప్రాంతం నుండి నాకు ఫోన్ చేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు నన్ను ఆ ఫోన్ మాట్లాడనివ్వరు. నన్ను మానసికంగా, శారీరకంగా ఎంతగా వేధిస్తారో ఆ సీన్ లో కనిపిస్తుంది. వారు నన్ను టార్చర్ చేసే విధానం, ఆ సమయంలో నా పాత్ర పడే వేదన చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నటిగా ఆ సీన్ నాకు చాలా ఇష్టం” అని సౌందర్య వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ చిన్న వీడియో క్లిప్, సౌందర్య తన పాత్రల పట్ల ఎంతటి అంకితభావంతో ఉండేవారో మనకు గుర్తుచేస్తుంది. ‘అమ్మోరు’ సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా, నేటికీ ఆ చిత్రంలో సౌందర్య నటన, ఆమె పలికించిన హావభావాలు ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోతాయి. భౌతికంగా సౌందర్య మన మధ్య లేకపోయినా, ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా ఆమె జ్ఞాపకాలు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి.

సౌందర్య పాత వీడియో.. 

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us
కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే మటన్ బోన్ సూప్..
కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే మటన్ బోన్ సూప్..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే..
బ్యాంక్ లాకర్‌లో ఉన్న మీ బంగారం పోతే.. నష్టపరిహారం వస్తుందా?
బ్యాంక్ లాకర్‌లో ఉన్న మీ బంగారం పోతే.. నష్టపరిహారం వస్తుందా?
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి తాండవమే..
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి తాండవమే..
రూపాయి ఖర్చు లేకుండా సొంతంగా సీసీ టీవీ సిస్టం
రూపాయి ఖర్చు లేకుండా సొంతంగా సీసీ టీవీ సిస్టం
తక్కువ తింటున్నా బరువు పెరుగుతున్నారా?డాక్టర్లు చెబుతున్న విషయాలు
తక్కువ తింటున్నా బరువు పెరుగుతున్నారా?డాక్టర్లు చెబుతున్న విషయాలు
ఇంటికొచ్చిన అతిధులకు వానాకాలంలో ఈ బియ్యపు పిండి ఉండలు పెడితే..
ఇంటికొచ్చిన అతిధులకు వానాకాలంలో ఈ బియ్యపు పిండి ఉండలు పెడితే..
మాట నిలబెట్టుకున్న తమన్.. మహేష్ బాబు అభిమాని కోసం..
మాట నిలబెట్టుకున్న తమన్.. మహేష్ బాబు అభిమాని కోసం..
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..