AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం కొత్త కండీషన్స్..

ఆధార్ కార్డు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఇందులో వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. వివరాలు తప్పుగా ఉంటే అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అయితే ఆధార్‌లోని వివరాలను మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. కానీ కొన్ని పరిమితులు విధించింది.

Aadhaar Card: ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..? కేంద్రం కొత్త కండీషన్స్..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Apr 08, 2026 | 1:52 PM

Share

ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు మీ డీటైల్స్‌లో తప్పుడు వివరాలు నమోదైతే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కేవైసీ ధృవీకరణ ప్రక్రియలో మీరు ఇబ్బందులు పడవచ్చు. ఒక్కొ ధృవీకరణ పత్రంలో ఒక్కొరకంగా వివరాలు ఉండటం సమస్యలు ఎదురవుతాయి. ఇప్పట్లో ప్రతీ పనికి ఆధార్ అనేది తప్పనిసరి అయింది. దీంతో ఆధార్‌లోని వివరాలను మార్చుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఉండవు. అయితే ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ కొన్ని పరిమితులు విధించింది. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు..?

ఆధార్ కార్డుల్లోని పేరు, డేట్ ఆఫ్ బర్త్‌కు సంబంధించి యూఐడీఏఐ కొన్ని కండీషన్స్ పెట్టింది. వాటిని మార్చుకునేందుకు కొన్ని పరిమితులు పెట్టింది. అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మార్చుకోవడానికి కుదరదు. పేరు కేవలం రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్ అయితే కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ కొన్ని నిబంధనలను రూపొందించింది.

నిబంధనలు ఇవే..

-పేరును జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే మార్చుకోవచ్చు

-డేట్ ఆఫ్ బర్త్ ఒక్కసారి మాత్రమే ఛేంజ్ చేసుకునే వెసులుబాటు ఉంది

-లింగాన్ని ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు

-అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి పరిమితులు విధించలేదు

పరిమితులు దాటిన తర్వాత..

ఇక పరిమితులు దాటిన తర్వాత ఏదైనా పొరపాట్లు ఉండి వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ రిజినల్ ఆఫీస్‌ను సంప్రదించాలి. అక్కడి అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించాక అనుమతి జారీ చేస్తారు. ఇక ఆధార్‌లో మార్పులు చేయాలంటే అందుకు అవసరమైన ప్రూఫ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇక మెయిల్ ద్వారా కూడా మీరు యూఐడీఏఐ అధికారులను సంప్రదించవచ్చు. అందుకే ఆధార్ కార్డులోని వివరాలు మార్చుకునేముందే కరెక్ట్‌గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడమే మంచిది.

Follow Us
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
MI vs SRH Playing XI: టాస్ గెలిచిన ముంబై..
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
రజనీతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
ఆ AI చిప్‌ని దేవుడే నా బ్యాట్ లో ఫిక్స్ చేశాడు..: వైభవ్ సూర్యవంశీ
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
అవి ఇస్తే నిత్యావసర సరుకులు ఫ్రీ.. ఏపీ ప్రభుత్వం డెసిషన్
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి