సంక్రాంతి సినిమాలు.. 11 ఏళ్ల తర్వాత బాలయ్యకు పోటీగా బరిలో స్టార్ హీరో..?
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఇటీవల కాలంలో ఆయన వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సంక్రాంతి అంటే ప్రజలకు పెద్ద పండగ మాత్రమే కాదు.. సినిమా పండగ కూడా. జనవరి వస్తుందంటే చాలు సినిమాలన్నీ సిద్దమవుతుంటాయి. సంక్రాంతికి బడా హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలై మంచి విజయాలను అందుకుంటుంటాయి. ఇక సంక్రాంతిని టార్గెట్ చేసి విడుదలయ్యే సినిమాలో ఎక్కువ శాతం బాలయ్య సినిమాలే ఉంటాయి. సంక్రాంతి అంటే బాలకృష్ణ సినిమా రావాల్సిందే.. ఎదో జరిగి ఆలస్యం అయితే తప్పా.. బాలయ్య సంక్రాంతి బరిలో ఎప్పుడూ నిలుస్తుంటారు. ఇప్పటికే 17 నుంచి 22 బాలయ్య సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటిలో చాలా వరకు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా బాలయ్య సినిమా రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణకు పోటీగా ఓ స్టార్ హీరో సినిమా కూడా సంక్రాంతికి సిద్ధం అవుతుంది. దాదాపు 11ఏళ్ల తర్వాత బాలయ్యతో సంక్రాంతి బరిలో పోటీకి న నిలుస్తున్నాడు ఆ హీరో.. ఇంతకూ ఆయన ఎవరంటే..
సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ కాస్త ఎక్కవగానే ఉంటుంది. ఛాన్స్ దొరికితే తమ సినిమాలు సంక్రాంతి బరిలో ఉంచాలని చూస్తారు. కాగా వచ్చే ఏడాది మాత్రం బాలయ్య సినిమాకు పోటీగా ఈసారి కింగ్ నాగార్జున నిలుస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే..
ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే బాలయ్య సినిమాకు పోటీగా కింగ్ నాగార్జున సినిమా రానుందని తెలుస్తుంది. నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘లాటరీ కింగ్’తో రాబోతుండగా.. ఈ సినిమాను సంక్రాంతికి రానుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాకు పోటీగా నాగార్జున సినిమా రానుంది. చివరిసారిగా 2016 సంక్రాంతి బరిలో బాలయ్య ‘డిక్టేటర్’తో పోటీగా నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం విడుదలైంది.
