Sun Transit: తులా రాశిలో రవి సంచారం.. వీరికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాల్లో సవాళ్లు..!
Sun Transit 2026: అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడి ఈ సంచారం వల్ల కొన్ని రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారు నవంబర్ 16 వరకు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. మరి ఈ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సూర్య గోచారం 2026: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, అధికారం, గౌరవం, నాయకత్వ సామర్థ్యానికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడి రాశి మార్పు (Sun Transit 2026) వల్ల వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 17, 2026న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. తులా రాశి సూర్యుడికి నీచ రాశిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సంచార సమయంలో కొన్ని రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
సూర్యుడి ఈ సంచారం సుమారు నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గడం, పనుల్లో ఆలస్యం జరగడం, ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్యుడి తులా రాశి సంచార సమయంలో ఉద్యోగ, వృత్తి రంగాల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. కార్యాలయంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లోనూ ముందుచూపుతో వ్యవహరించాలి. అవసరం లేని ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని అంశాలను పరిశీలించడం అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల కారణంగా మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే విషయాల్లో తొందరపడకూడదు. ఉద్యోగులు తమ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యం, విశ్రాంతి విషయంలోనూ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సూర్యుడి సంచారం వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం ఏర్పడే అవకాశం ఉందని. ఎక్కువ శ్రమించినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. కోపం, తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని అంశాలను పరిశీలించడం అవసరం. డబ్బు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ, ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది.
(గమనిక: ఈ కథనం జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా రూపొందించబడింది. గ్రహ సంచారాల వల్ల నిర్దిష్ట ఫలితాలు తప్పనిసరిగా జరుగుతాయని శాస్త్రీయ ఆధారాలు లేవు)




