AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల చదువు, పెళ్లి కోసం రూ.కోటి రెడీ చేయండి! ఇలా సింపుల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో..

పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్ అవసరాల కోసం చిన్న వయసులోనే SIP పెట్టుబడులు ప్రారంభిస్తే భారీ కార్పస్ సృష్టించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే సరికి రూ. కోటి సమీకరించాలంటే వయసును బట్టి నెలవారీ SIP మొత్తం మారుతుంది. ముందుగానే ప్రారంభిస్తే తక్కువ పెట్టుబడితోనే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

పిల్లల చదువు, పెళ్లి కోసం రూ.కోటి రెడీ చేయండి! ఇలా సింపుల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో..
Sip Investment
SN Pasha
|

Updated on: May 27, 2026 | 7:45 AM

Share

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాలపై ఆర్థిక భారం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా విద్యా ఖర్చులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు కోసం ముందుగానే ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం మంచి పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించడం మాత్రమే కాకుండా, ఉన్నత విద్య, కెరీర్‌, వివాహం వంటి భవిష్యత్ అవసరాలకు కూడా బలమైన ఆర్థిక భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా మంది పేరెంట్స్ మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు.

నెలనెలా కొంత మొత్తం క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో భారీ కార్పస్ సృష్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే SIP ప్రారంభిస్తే, తక్కువ మొత్తంతోనే భవిష్యత్తులో పెద్ద నిధిని సమీకరించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఎక్కువకాలం పెట్టుబడి కొనసాగితే వడ్డీపై వడ్డీ చేరుతూ పెట్టుబడి వేగంగా పెరుగుతుందని వివరిస్తున్నారు.

సగటున ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు సంవత్సరానికి 12 శాతం వరకు రాబడులు అందిస్తాయని భావిస్తే, పిల్లలకు 18 ఏళ్లు వచ్చే సరికి రూ. కోటి సమీకరించడానికి అవసరమైన SIP మొత్తం వయసును బట్టి మారుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే SIP ప్రారంభిస్తే, నెలకు సుమారు రూ.14,050 పెట్టుబడి చేస్తే 18 ఏళ్లలో రూ.కోటి కార్పస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే పిల్లలకు మూడేళ్లు వచ్చిన తర్వాత ప్రారంభిస్తే నెలకు దాదాపు రూ.21,011 పెట్టాలి. ఐదేళ్ల వయసులో ప్రారంభిస్తే ఈ మొత్తం రూ.27,946కి చేరుతుంది.

ఇంకా ఆలస్యమైతే పెట్టుబడి భారం మరింత పెరుగుతుంది. పిల్లలకు 8 ఏళ్లు ఉన్నప్పుడు SIP ప్రారంభిస్తే నెలకు రూ.44,636 పెట్టాల్సి వస్తుంది. 10 ఏళ్ల వయసులో మొదలెడితే కేవలం 8 ఏళ్ల వ్యవధిలో రూ. కోటి సమీకరించాలంటే నెలకు సుమారు రూ.63,685 పెట్టుబడి అవసరం అవుతుంది. అందుకే పిల్లల భవిష్యత్తు కోసం చిన్న వయసులోనే SIP ప్రారంభించడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ