AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Chilli vs Red Chilli: పచ్చిమిర్చి Vs ఎండు మిర్చి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? సమ్మర్‌లో ఏది బెస్ట్‌!

Green Chilli vs Red Chilli: భారతీయ వంటకాల్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండింటినీ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఎండకాలంలో పచ్చిమిర్చి తినడం చాలా మంచిదని, ఇది వడదెబ్బ తగలకుండా కాపాడుతుందని అంటుంటారు. అయితే నిజంగానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కంటే బెటరా? ఇది వడదెబ్బ నుండి ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: May 27, 2026 | 7:03 AM

Share
పచ్చిమిర్చిని పచ్చళ్లు, కూరల తాలింపుల్లోనే కాకుండా పచ్చిగా తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. అలాగే  ఎండుమిర్చి పొడి చేసి రోజువారీ వంటల్లో కారం కోసం, తాలింపులకు ఉపయోగిస్తారు. ఈ రెండూ ఘాటుగా ఉన్నప్పటికీ, వీటి మధ్య ప్రాథమిక వ్యత్యాసం రంగు, తేమలోనే ఉంటుంది. పచ్చిమిర్చి తాజాగా ఉంటే, ఎండుమిర్చి ఎండిన రూపంలో ఉంటుంది. చూడటానికి ఒకేలా అనిపించినా, ఇవి శరీరంపై చూపే ప్రభావం వేర్వేరుగా ఉంటుంది.

1 / 6
పోషకాల్లో తేడాలు: పచ్చిమిర్చి తాజాగా ఉంటుంది, కానీ ఎండుమిర్చిని ఎండబెట్టి తయారు చేస్తారు. అందుకే వీటిలో ఉండే పోషకాల పరిమాణంలో తేడా ఉంటుంది. ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చిలో విటమిన్ సి, క్యాప్సైసిన్ ఎక్కువగా ఉంటాయి. పబ్‌మెడ్ పరిశోధనల ప్రకారం.. తాజా మిరపకాయల్లో ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ వాటిని ఎండబెట్టినప్పుడు విటమిన్ సి చాలా వరకు తగ్గిపోతుంది.

2 / 6
ఎండుమిర్చి: విటమిన్ ఎ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. మిరపకాయలను ఎండబెట్టినప్పుడు వాటిలో విటమిన్ ఎ పరిమాణం దాదాపు 100 రెట్లు పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే మిరపకాయల్లో ఉండే కెరోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ పరిమాణం పుల్లని పండ్ల కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

3 / 6
ఏది ఎక్కవ ప్రయోజనకరం: పచ్చిదా లేక ఎర్రదా, ఏ మిరపకాయ ఎక్కువ ప్రయోజనకరం అని చర్చి వస్తే, మీరు మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ శరీరానికి విటమిన్ సి కావాలనుకుంటే పచ్చిమిర్చి ఉత్తమం. అదే విటమిన్ ఎ కావాలనుకుంటే ఎండుమిర్చి మంచిది. ఎక్కువ మసాలాలు, కారం తినడం వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలపై పెద్దగా పరిశోధనలు లేకపోయినప్పటికీ, మితిమీరిన ఘాటు వల్ల ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే కారం తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తారు.

4 / 6
మిరపకాయలలో పోషకాలు?: హెల్త్‌లైన్ ప్రకారం, మిరపకాయలలో విటమిన్ సి, బి6, విటమిన్ కె1, పొటాషియం, కాపర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి..  అలాగే లూటిన్, ఫెరులిక్ యాసిడ్, సినాపిక్ యాసిడ్, క్యాప్సైసిన్, వాయోలాక్సంతిన్, క్యాప్సంతిన్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఇవి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. దీనిలో ఉండే హైపోగ్లైసిమిక్ ప్రభావం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

5 / 6
పచ్చిమిర్చి వడదెబ్బ నుండి రక్షిస్తుందా?: పచ్చి పచ్చిమిర్చి తినడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. అయితే నివేదికల ప్రకారం.. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మైక్రోబయోమ్ మోడ్యులేటర్‌గా పనిచేస్తూ, పొట్టలోని హానికరమైన బ్యాక్టీరియాను, రోగకారక క్రిములను నశింపజేస్తుంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది. సాధారణంగా ఎండకాలంలో వేడి వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పచ్చిమిర్చి జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచడం ద్వారా, ఎండ వేడి వల్ల కలిగే అలసట, అజీర్ణం, వడదెబ్బ లక్షణాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

6 / 6
Follow Us