AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Xpress Way: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు పండుగ బంపర్‌ ఆఫర్‌.. ఇక ఎక్స్‌ప్రెస్‌లాంటి సేవలు.. ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా సాధ్యం..

ఇప్పటి వరకూ కేవలం ఖాతాదారులకు మాత్రమే యాప్‌ల ద్వారా సేవలందించే బ్యాంకులు కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి కూడా కొత్త యాప్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్‌లు బ్యాంక్‌కి అత్యంత వేగవంతమైన మార్గాన్ని అనుభవించగలుగుతారు.

HDFC Xpress Way: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు పండుగ బంపర్‌ ఆఫర్‌.. ఇక ఎక్స్‌ప్రెస్‌లాంటి సేవలు.. ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా సాధ్యం..
Hdfc Bank
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 23, 2023 | 7:10 PM

Share

భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిల్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లకు చేరువ కావడానికి అన్ని బ్యాంకులు ఆండ్రాయిడ్‌ యాప్‌ల ద్వారా సేవలను అందిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ కేవలం ఖాతాదారులకు మాత్రమే యాప్‌ల ద్వారా సేవలందించే బ్యాంకులు కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి కూడా కొత్త యాప్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్‌లు బ్యాంక్‌కి అత్యంత వేగవంతమైన మార్గాన్ని అనుభవించగలుగుతారు. హెచ్‌డీఎఫ్‌సీ ఎక్స్‌ప్రెస్‌వే సేవల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎక్స్‌ప్రెస్‌ వే యాప్‌ ద్వారా పర్సనల్‌లోన్‌, బిజినెస్‌ లోన్స్‌,కారు లోన్‌, హోమ్‌ లోన్‌, కార్డులపై కూడా లోన్‌లు, క్రెడిట్‌ కార్డు, సేవింగ్స్‌ ఖాతాలు, సర్వీస్‌ జర్నీలు, మరెన్నో విభిన్న కస్టమర్‌ అవసరాలను తీరుస్తాయి. బ్యాంక్ ప్రతినిధులు పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సేవలు ఇప్పటికే ఉన్న లేదా కొత్త కస్టమర్‌ల కోసం వేగవంతమైన పేపర్‌లెస్ జర్నీని అందిస్తాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పండుగ సీజన్‌లో లాంచ్ చేసిన ఈ యాప్‌ ద్వారా కస్టమర్లు పండుగ సీజన్‌లో షాపింగ్‌లో సరికొత్త అనుభవాన్ని ఎంజాయ్‌ చేస్తారని వివరిస్తున్నారు. కస్టమర్-సెంట్రిక్ ఇన్నోవేషన్‌కు హెచ్‌డీఎఫ్‌సీ నిబద్ధతను ఈ తాజా చర్యలు సూచిస్తున్నాయని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌లకు ఈ యాప్‌ వేగవంతమైన, పేపర్‌లెస్, స్వీయ-సేవ బ్యాంకింగ్‌తో సాధికారతను అందించే డిజిటల్ పర్యావరణ వ్యవస్థను అందిస్తుంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో వేడుకల ఆనందాన్ని పెంచాలని లక్ష్యంగా ఈ యాప్‌ను లాంచ్‌ చేశామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వేగవంతమైన మరింత సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ – పేమెంట్స్, లయబిలిటీ ప్రొడక్ట్స్, కన్స్యూమర్ ఫైనాన్స్ & మార్కెటింగ్ పరాగ్ రావ్ఘీ యాప్‌ లాంచ్‌ సందర్భంగా పేర్కొన్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే అనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘నౌ’లో ఓ భాగమని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి