AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: ఈ 5 బ్యాంకుల రుణాలు మరింత ఖరీదు.. పూర్తి వివరాలు

కొత్త పెంపు తర్వాత కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ 7.95%, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.05%. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.50 కాగా, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.15%. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ 1 సంవత్సరం కాలవ్యవధికి 8.70%. 12 మార్చి 2023న లేదా ఆ తర్వాత మంజూరైన తాజా రుణాలకు మాత్రమే వర్తిస్తాయి. బ్యాంకు వడ్డీ రేట్ల పెరుగుదల కొత్త రుణగ్రహీతలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బ్యాంకులు తమ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను పెంచినప్పుడు, సాధారణంగా నెలవారీ..

Bank Loan: ఈ 5 బ్యాంకుల రుణాలు మరింత ఖరీదు.. పూర్తి వివరాలు
Bank Loan
Subhash Goud
|

Updated on: Aug 17, 2023 | 3:46 PM

Share

మీరు రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో రుణం తీసుకోవడం మునుపటి కంటే ఖరీదైనవిగా మారాయి. నిజానికి బ్యాంకులు రుణ రేట్లను పెంచుతున్నాయి. ఈ కారణంగా రుణం తీసుకోవడం కొంత భారంగానే ఉంటుంది. ప్రభుత్వ రంగ రుణదాత కెనరా బ్యాంక్ ఆగస్టు 12 నుంచి హోమ్ లోన్ రేట్లు, ఇతర రుణ రేట్లను పెంచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా భారతదేశంలోని అగ్ర బ్యాంకులు ఆగస్టులో నిధుల ఆధారిత రుణ రేటు (MCLR) మార్జినల్ కాస్ట్‌ను పెంచాయి.

కొత్త పెంపు తర్వాత కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ 7.95%, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.05%. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.50 కాగా, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.15%. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ 1 సంవత్సరం కాలవ్యవధికి 8.70%. 12 మార్చి 2023న లేదా ఆ తర్వాత మంజూరైన తాజా రుణాలకు మాత్రమే వర్తిస్తాయి. బ్యాంకు వడ్డీ రేట్ల పెరుగుదల కొత్త రుణగ్రహీతలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బ్యాంకులు తమ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను పెంచినప్పుడు, సాధారణంగా నెలవారీ ఈఎంఐకి బదులుగా రుణ కాల వ్యవధిని పెంచుతాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రేట్లు ఆగస్ట్ 7 నుంచి అమలులోకి వచ్చేటటువంటి ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ల బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ (ఎంసీఎల్‌ఆర్‌)ని 15 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఏదేమైనప్పటికీ ఒక సంవత్సరం దాటిన కాలవ్యవధికి ఎంసీఎల్‌ఆర్‌ మారదు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వివిధ అవధులపై తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. కొత్త రేట్లు ఈనెల 12 నుంచి అమల్లోకి వచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలపై తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసిఎల్‌ఆర్)ను సవరించాయి. బ్యాంక్ వెబ్‌సైట్ల ప్రకారం.. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని రుణదాతలు తమ వెబ్‌సైట్‌లలో పేర్కొన్నారు.

రెపో రేటులో మార్పు లేదు:

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా మూడోసారి తన కీలక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఏకగ్రీవ నిర్ణయంలో ఎంపీసీ బెంచ్‌మార్క్ కొనుగోలు రేటు (రెపో)ని 6.50 శాతం వద్ద ఉంచింది. ఈ సమావేశ ఫలితాలను ఆగస్టు 10న ఆర్‌బిఐ చీఫ్ శక్తికాంత దాస్ ప్రకటించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి