Bank Accounts: కోటి మందికిపైగా పెరిగిన ఈ ఖాతాదారుల సంఖ్య.. మోడీ సర్కార్‌ ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందంటే..

పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ దాని లబ్ధిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఫైనాన్షియల్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3.59 కోట్ల మంది కొత్త ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలను తెరిచారు. విశేషమేమిటంటే 2023 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం 1 కోటికి పైగా జన్ ధన్ ఖాతాలు తెరిచినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి..

Bank Accounts: కోటి మందికిపైగా పెరిగిన ఈ ఖాతాదారుల సంఖ్య.. మోడీ సర్కార్‌ ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందంటే..
Bank Accounts
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2023 | 4:52 PM

ప్రతి పౌరుడిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవడం ద్వారా కోట్లాది మంది ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందారు. పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు కావస్తున్నా, ఇప్పటికీ దాని లబ్ధిదారుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. ఫైనాన్షియల్ టైమ్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3.59 కోట్ల మంది కొత్త ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాలను తెరిచారు. విశేషమేమిటంటే 2023 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం 1 కోటికి పైగా జన్ ధన్ ఖాతాలు తెరిచినట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.

జన్ ధన్ ఖాతాలో జమ చేసిన మొత్తం ఎంత?

అదే సమయంలో 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.86 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్రం తెలిపింది.2021 ఆర్థిక సంవత్సరం ఈ కాలంలో 3.87 కోట్ల కొత్త ఖాతాలు నమోదు అయ్యాయి. అటువంటి పరిస్థితిలో జూలై 2023 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 49.63 కోట్లకు పెరిగింది. మరోవైపు ఖాతాలతో పోలిస్తే డిపాజిట్ల గురించి మాట్లాడితే.. ఈ త్రైమాసికంలో రూ.4,000 కోట్ల స్వల్ప పెరుగుదల నమోదైంది. అటువంటి పరిస్థితిలో ఈ పథకం మొత్తం మార్చి 31, 2023 నాటికి రూ.1.99 లక్షల కోట్ల నుంచి 2023 ఆగస్టు 2 నాటికి రూ.2.03 లక్షల కోట్లకు పెరిగింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చాలా జన్ ధన్ ఖాతాలు నమోదు అయ్యాయి. పీఎం జన్ ధన్ ఖాతాలు తెరవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి. మార్చి 2021 నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాల సంఖ్య 33.26 కోట్లుగా ఉంది. ఇది మే 2023 నాటికి 38.58 కోట్లకు పెరిగింది. ఈ పరిస్థితిలో గత రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజన అకౌంట్ల సంఖ్య 16 శాతం పెరిగింది. అదే సమయంలో ప్రభుత్వ మద్దతు ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) సంఖ్య 21 శాతం పెరిగింది. 7.1 కోట్ల ఖాతాల నుంచి 9.1 కోట్ల ఖాతాలకు పెరిగింది. అదే సమయంలో మార్చి 2021, మే 2023 మధ్య, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాల సంఖ్యలో కేవలం 12 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది.

ఇవి కూడా చదవండి

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అంటే ఏమిటి?

దేశంలోని ప్రతి వ్యక్తిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 28 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మీరు ఏదైనా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. ఇందులో, ఖాతాదారులందరికీ ఉచిత రూపే డెబిట్ కార్డ్, రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ ప్రయోజనం లభిస్తుంది. దీంతో పాటు రూ.10,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లబ్ధిదారులకు లభిస్తుంది. ఈ ఖాతాల ద్వారా దేశంలోని కోట్లాది మందికి డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా పీఎం కిసాన్ స్కీమ్, పీఎం ఫసల్ బీమా యోజన మొదలైన వివిధ పథకాల కోసం ప్రభుత్వం డబ్బును బదిలీ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు