Bank Loan: ఇంటి కోసమే కాదు.. ప్లాట్‌ కోసం కూడా లోన్ ఇస్తారని మీకు తెలుసా?

ఇల్లు లేదా ఫ్లాట్‌ని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకోవడం కంటే భూమి లేదా ప్లాట్ కోసం లోన్ తీసుకోవడం సులభం. అయితే ఇక్కడ భూమి విషయంలో అది ఏ రకానికి చెందినది అనేది చాలా ముఖ్యం. చాలా బ్యాంకులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి లోన్స్ ఇవ్వవు. కొన్ని పీఎస్‌యూలు.. అంటే ప్రభుత్వ బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. కానీ అందరికి ఇవ్వవు. భూమి లేని చిన్న రైతులు లేదా కూలీలు వ్యవసాయ భూమి కోసం లోన్ పొందవచ్చు. ఇక వ్యవసాయేతర భూమి కొనుగోలు చేయడానికి లోన్  పొందడం కొంచెం సులభం..

Bank Loan: ఇంటి కోసమే కాదు.. ప్లాట్‌ కోసం కూడా లోన్ ఇస్తారని మీకు తెలుసా?
Bank Loan
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2023 | 4:23 PM

కొందరికి కట్టిన ఇల్లు కొనడం కంటే.. ప్లాట్ కొనుక్కుని ఇల్లు తనకు నచ్చినట్టుగా కట్టుకోవాలని కోరిక. అయితే బ్యాంకులు ఇల్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం కోసం లోన్స్ ఇస్తాయి కానీ.. ప్లాట్ కొనుక్కోవడానికి ఇవ్వవు అని చాలా మంది వింటుంటారు. మీరు కూడా ఇలానే విని ఉంటే అది సరైనది కాదు. ఇందులో అస్సలు నిజం లేదు. మీరు భూమి లేదా ప్లాట్ కొనడానికి కూడా బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఈ లోన్ ఎలా పొందాలో అలాగే వడ్డీ రేటు ఎంత ఉండచ్చు. అదీకాకుండా హోమ్ లోన్ కీ.. దీనికీ ఎటువంటి తేడా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇల్లు లేదా ఫ్లాట్‌ని కొనుగోలు చేయడానికి హోమ్ లోన్ తీసుకోవడం కంటే భూమి లేదా ప్లాట్ కోసం లోన్ తీసుకోవడం సులభం. అయితే ఇక్కడ భూమి విషయంలో అది ఏ రకానికి చెందినది అనేది చాలా ముఖ్యం. చాలా బ్యాంకులు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయడానికి లోన్స్ ఇవ్వవు. కొన్ని పీఎస్‌యూలు.. అంటే ప్రభుత్వ బ్యాంకులు లోన్స్ ఇస్తాయి. కానీ అందరికి ఇవ్వవు. భూమి లేని చిన్న రైతులు లేదా కూలీలు వ్యవసాయ భూమి కోసం లోన్ పొందవచ్చు. ఇక వ్యవసాయేతర భూమి కొనుగోలు చేయడానికి లోన్  పొందడం కొంచెం సులభం అని చెప్పవచ్చు. అలాగే వీటిలో కూడా రెసిడెన్షియల్ ప్లాట్ కోసం లోన్ మరింత ఈజీగా దొరుకుతుంది. రెసిడెన్షియల్ ప్లాట్ మునిసిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ ప్రాంతంలో ఉండాలి.

నగరం శివార్లలో ప్లాట్‌ని కొనుగోలు చేయడానికి కూడా లోన్ పొందవచ్చు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. డెవలప్‌మెంట్ అథారిటీ లేదా పెద్ద డెవలపర్‌లు చేసిన ప్లాట్ లకు మాత్రమె బ్యాంకులు సాధారణంగా రెసిడెన్షియల్ ప్లాట్‌ల కోసం లోన్స్ ఇస్తాయి. హోమ్ లోన్స్ 30 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్లాట్ లేదా భూమి లోన్ కాలపరిమితి అంత ఎక్కువ కాలం ఉండదు. ప్లాట్లపై లోన్‌ను తిరిగి చెల్లించడానికి బ్యాంకులు సాధారణంగా 15 సంవత్సరాల వరకు గడువు ఇవ్వవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్లాట్ లోన్ కాలవ్యవధి 10 సంవత్సరాలు. ప్లాట్ లోన్ ఎల్‌టీవీ అంటే లోన్-టు-వాల్యూ రేషియో హోమ్ లోన్ కంటే తక్కువగా ఉంది. హోం లోన్ విషయంలో ఇది ఆస్తి ధరలో 90% వరకు ఉంటుంది. అయితే ప్లాట్ లోన్ విషయంలో భూమి ధరలో 70 నుంచి 75 శాతం మాత్రమే లోన్‌గా అందుబాటులో ఉంటుంది. ప్లాట్ లోన్ తీసుకున్నప్పుడు దాదాపు 25 నుంచి 30 శాతం డబ్బును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ లోన్‌తో పోలిస్తే ప్లాట్ లోన్ కొంచెం రిస్క్‌తో కూడుకున్నదిగా పరిగణిస్తారు. దీని కారణంగా ప్లాట్ లోన్ వడ్డీ రేటు హోమ్ లోన్ కంటే 1.5 శాతం ఎక్కువగా ఉంటుంది. వాణిజ్య లేదా పారిశ్రామిక ప్లాట్ల విషయంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

bankbazaar.com ప్రకారం.. ఎస్‌బీఐ హోమ్ లోన్ రేటు 9.15 శాతం నుంచి మొదలవుతుంది. అయితే ప్లాట్ లోన్ వడ్డీ రేటు 9.20 నుంచి 9.80 శాతం మధ్య నుంచి మొదలవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ రేటు 8.45 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్లాట్‌ లోన్‌ ప్రారంభ రేట్లు 8.65 నుంచి 9.35% వరకు ఉన్నాయి. ఫెడరల్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 8.80% నుంచి ప్రారంభమవుతాయి. ప్లాట్ లోన్ రేట్లు 12.35% నుంచి ప్రారంభమవుతాయి. పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ రేట్లు 8.75% నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్లాట్ లోన్ ప్రారంభ రేటు 9.5 నుంచి 11.65 శాతం మధ్య ఉంది.

సెక్షన్ 80C కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై రూ.1.5 లక్షల వరకు అలాగే సెక్షన్ 24B కింద చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ప్లాట్ లేదా భూమి లోన్ విషయంలో టాక్స్ బెనిఫిట్స్ అందుబాటులో ఉండవు. మీరు భూమిని కొనుగోలు చేయడానికి, ఇల్లు నిర్మించడానికి ప్లాట్ కొనుగోలు అలాగే నిర్మాణ రుణం తీసుకుంటే మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్లాట్ ప్లస్ నిర్మాణ రుణం తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఇలా చేయడం హోం లోన్ కిందే పరిగణిస్తారు. వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మొత్తం ఖర్చులో 80-90% వరకు లోన్ కూడా అందుబాటులో ఉంటుంది. లోన్ ఇవ్వడానికి ముందు బ్యాంక్ ప్రాపర్టీ వాల్యూను చెక్ చేస్తుంది. అలాగే టైటిల్ డీడ్ అంటే రిజిస్ట్రీ తో పాటు మీ లోన్ రీపెమేంట్ సామర్థ్యాన్ని కూడా చెక్ చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి