AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: మీ భార్యకు షేర్లు బహుమతిగా ఇస్తే.. పన్ను పడుతుందా? పూర్తి వివరాలు..

మీరు ఇచ్చే బహుమతి అది నగదు అయినా, వస్తువులు అయినా, లేదా ప్రాపర్టీ అయినా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కానీ దానికి సంబంధించిన అన్ని పత్రాలను పక్కా ఉంచుకోవడం ముఖ్యం. పన్ను ప్రభావాలు, పెనాల్టీలు నిర్వహించడం, వాటిని అర్థం చూసుకోవడం అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు బహుమతులు బహిర్గతం చేయడం కూడా ముఖ్యమైనదే.

Income Tax: మీ భార్యకు షేర్లు బహుమతిగా ఇస్తే.. పన్ను పడుతుందా? పూర్తి వివరాలు..
Income Tax
Madhu
|

Updated on: Aug 16, 2023 | 5:00 PM

Share

పన్ను చెల్లింపుదారులు ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఉండాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏవి పన్ను పరిధిలోకి వస్తాయి? వేటికి పన్ను మినహాయింపులు ఉన్నాయి అనే విషయంలపై అవగాహన కలిగి ఉండాలి. చాలా మంది తన బంధువులకు గిఫ్ట్ గా ప్రాపర్టీలు గానీ, నగదు గానీ, బంగారం గానీ ఇస్తుంటారు. అవే భర్తలు భార్యలకు, భార్యలు, భర్తలకు కూడా పలు బహుమతులు ఇస్తుంటారు. కొందరు తమకు షేర్ మార్కెట్లో ఉన్న కొన్ని షేర్లు కూడా తమ భార్యల పేరు పైకి మారుస్తుంటారు. అటువంటి సమయంలో షేర్ల వల్ల గిఫ్ట్ పొందిన వారిపై ట్యాక్స్ భారం పడుతుందా? ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఏం చెబుతోంది? యాక్ట్ లో ఏముంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

బహుమతి ఏ రూపంలో ఉంటే..

మీరు ఇచ్చే బహుమతి అది నగదు అయినా, వస్తువులు అయినా, లేదా ప్రాపర్టీ అయినా ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కానీ దానికి సంబంధించిన అన్ని పత్రాలను పక్కా ఉంచుకోవడం ముఖ్యం. పన్ను ప్రభావాలు, పెనాల్టీలు నిర్వహించడం, వాటిని అర్థం చూసుకోవడం అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు బహుమతులు బహిర్గతం చేయడం కూడా ముఖ్యమైనదే.

షేర్లు గిఫ్ట్ ఇస్తే పన్నులుంటాయా?

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, ఒక బంధువుకు షేర్లను బహుమతి ఇస్తే ఆ గ్రహీతకు పన్ను విధించబడదు. సెక్షన్ 56(2) (vii) ప్రకారం బంధువు లనే దానిలోకి మీ భార్య కు వస్తుంది. కాబట్టి మీ భార్యకు మీ షేర్లు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమెకు పన్ను భారాలు ఉండవు. అయితే మూలధన ఆస్తి బదిలీ, మూలధన లాభాల పన్నుకు దారితీయవచ్చని ఆదాయపు పన్ను చట్టం పేర్కొంటుంది. అయితే, సెక్షన్ 47 ప్రత్యేకంగా బహుమతులను బదిలీ నిర్వచనం నుండి మినహాయించింది. అందువల్ల, బహుమతిని పంపినవారు అటువంటి లావాదేవీపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

వీటిపై పన్ను ఉంటుంది..

అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం షేర్లు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌లతో సహా తరలించదగిన రూ.50,000 కన్నా ఎక్కువ మార్కెట్ విలువగలిగిన ఆస్తుల బహుమతుల పొందుకున్న వారికి పన్ను విధించబడుతుంది. ఈ రకమైన బహుమతుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఇతర వనరుల నుంచి ఆదాయం అనే విభాగం కింద ప్రకటించాలి.

ఈ పరిస్థితుల్లో పన్ను మినహాయింపు..

  • ఒక వ్యక్తి తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా వారసుల వంటి బంధువు నుంచి తీసుకున్న బహమతికి పన్ను విధించబడదు.
  • ఒక వ్యక్తికి వారి వివాహం జరిగిన రోజున బహుమతి ఇస్తే అది కూడా పన్ను పరిధిలోకి రాదు.
  • ఒక వ్యక్తి వారసత్వం ద్వారా బహుమతిని పొందితే పన్ను మినహాయింపు ఉంటుంది.

బహుమతి ఇచ్చిన షేర్లపై.. దానిని ఇచ్చిన వారు ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైలింగ్ లో దీనినిచేర్చాల్సిన అవసరం లేదు. బహుమతికి పన్ను మినహాయింపు ఉన్నట్లయితే, వారు దానిని షెడ్యూల్ మినహాయింపు ఆదాయం కింద ప్రకటించాలి లేదా షెడ్యూల్ ఓఎస్ ఐఎఫ్ఓఎస్లో నివేదించాలి. బహుమతి పన్ను పరిధిలోకి వస్తే, వర్తించే స్లాబ్ రేట్లను ఉపయోగించి చెల్లించాల్సిన పన్నును లెక్కించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..