Business Ideas: ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు! లాభాలు అందించే బిజినెస్..
పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ ప్రాంతంలో నెలకు 50,000 సంపాదించే చక్కటి వ్యాపారం. సరైన అవగాహనతో, తక్కువ పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు. ఇందులో విటమిన్ డి, ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు సరఫరా చేస్తూ అధిక లాభాలు పొందవచ్చు.

వ్యాపారం చేయడం ఒక సవాల్ అని చాలా మంది అనుకుంటారు. ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని భయపడుతూ ఉంటారు. అయితే సరైన అవగాహన, కష్టపడే తత్వం ఉంటే బిజినెస్‌లో సక్సెస్ అవ్వొచ్చు. పైగా ప్రస్తుత కాలంలో వ్యాపారం చేయడం చాలా సులభతరంగా మారింది. మార్కెటింగ్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా ఉంది. గతంలో పట్టణాలు, టౌన్లకు వ్యాపారాలు పరిమితం అయ్యేవి.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యాపారాలు ప్రారంభించి, పట్టాణాలకు వస్తువులు, సేవలు అందించేగా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది.
అందుకే గ్రామీణ ప్రాంతంలో ఉంటూ చేయగలిగే చక్కటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతినెల రూ.50 వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటంటే.. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగుల పెంపకం చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు పుట్టగొడుగులు తినమని సలహా ఇస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో విటమిన్ డి లభించడమే అందుకు కారణం. అంతేకాదు ప్రోటీన్ కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది.
పుట్టగొడుగుల ఉత్పత్తి కోసం మీరు గ్రామంలో కేవలం ఒక గదిని ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. పుట్టగొడుగుల పెంపకం తర్వాత వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు. రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటల్స్, సూపర్ మార్కెట్లకు నేరుగా సప్లైయ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. వీటికి డిమాండ్ కూడా బాగానే ఉంది. పుట్టగొడుగుల ఉత్పత్తి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, ఆదాయం కూడా అంతే మొత్తంలో లభిస్తుంది. అయితే వాటి పెంపకంపై కచ్చితంగా అవగాహన వచ్చిన తర్వాతనే ఈ బిజినెస్ మొదలుపెడితే మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




