AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Tips: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. ఆ కంపెనీలో పెట్టుబడితో ఎఫ్‌డీకు మించిన రాబడి

తాజాగా ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎఫ్‌డీకు మించిన రాబడిని పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ డైవర్సిఫైడ్‌ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వారి వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చుకోవడానికి తన తొలి నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ప్రారంభించింది. ఇలా దాదాపు రూ.1000 కోట్లు సమకూర్చుకుంటుందని తెలుస్తోంది. ట్రాంచ్‌ -1 కింద రూ.200 కోట్ల బేష్‌ ఇష్యూ పరిమాణం, రూ.800 కోట్ల వరకూ గ్రీన్‌ ఇష్యూ ఎంపికతో వస్తుంది. అంటే దాదాపు రూ.1000 కోట్లు.

Investment Tips: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. ఆ కంపెనీలో పెట్టుబడితో ఎఫ్‌డీకు మించిన రాబడి
Investment
Nikhil
| Edited By: |

Updated on: Oct 23, 2023 | 7:30 PM

Share

మన సొమ్మును భవిష్యత్‌ అవసరాలను తీర్చుకోవడానికి వివిధ పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. పైగా వాటికి మంచి వడ్డీ రావాలని కోరుకుంటూ ఉంటాం. బ్యాంకులతో పాటు నాన్‌ ఫైనాన్సింగ్‌ సంస్థలు వడ్డీ రేటు అందిస్తున్నప్పటికీ అది తక్కువ అని ఫీలవుతూ ఉంటాం. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చిన వడ్డీ కూడా ఇవ్వడం లేదని అనుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ కంపెనీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఎఫ్‌డీకు మించిన రాబడిని పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ డైవర్సిఫైడ్‌ నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వారి వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చుకోవడానికి తన తొలి నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ప్రారంభించింది. ఇలా దాదాపు రూ.1000 కోట్లు సమకూర్చుకుంటుందని తెలుస్తోంది. ట్రాంచ్‌ -1 కింద రూ.200 కోట్ల బేష్‌ ఇష్యూ పరిమాణం, రూ.800 కోట్ల వరకూ గ్రీన్‌ ఇష్యూ ఎంపికతో వస్తుంది. అంటే దాదాపు రూ.1000 కోట్లు. ఎన్‌సీడీ ఇష్యూ కనీస సబ్‌స్క్రిప్షన్‌ పరిమాణం రూ.10,000గా ఉంది. ఆ తర్వాత రూ.1000 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ ఇష్యూ చేయడం అక్టోబర్‌ 19న ప్రారంభించారు. ఈ సమయంలో నవంబర్‌ 2తో ముగుస్తుంది. ఈ ఎన్‌సీడీ పెట్టుబడికి సంబంధించిన మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.1000 ముఖ విలువతో కూడిన సెక్యూర్డ్‌,రేటెడ్‌, లిస్టెడ్‌, రీడిమ్‌ చేసే అవకాశం ఉన్న నాన్‌కన్వెర్టబుల్‌ డిబెంచర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో జాబితా చేయాలని ప్రతిపాదించారు. బీఎస్‌ఈ ఇష్యూ కోసం నియమించిన స్టాక్‌ ఎక్స్చేంజ్‌ కంపెనీ. ఎన్‌సీడీలు 9 శాతం నుంచి 9.35 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ ఎన్‌సీడీ ఇష్యూలకు రెండు, మూడు, ఐదు, పదేళ్లల్లో మెచ్యూరిటీ అవుతాయి. వార్షిక చెల్లింపులు కూడా వాటికి అనుగుణంగానే ఉంటాయి. అంటే పిరమల్‌ ఎన్‌సీడీ బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుందని తెలుస్తోంది. గరిష్టంగా ప్రముఖ బ్యాంక్‌ ఎస్‌బీఐ 7.5 శాతం వడ్డీ ఇస్తుంది. వీటితో పోల్చుకుంటే ఎన్‌సీడీ చాలా ఎక్కువ వడ్డీ అందిస్తున్నట్లే లెక్క. అయితే వీటిల్లో పెట్టుబడి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

మీ పెట్టుబడులపై గరిష్ట రాబడిని పొందేందుకు అలాగే ప్రతికూల రాబడి విషయంలో ప్రమాదం నుంచి రక్షణ పొందేందుకు డైవర్సీఫికేషన్‌ చాలా కీలకం. నిపుణులు తమ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోల్లో 25-30 శాతాన్ని బాండ్‌లకు కేటాయించాలని సలహా ఇస్తున్నారు. అంటే ప్రస్తుత పిరమిల్‌ ఎన్‌సీడీలో  నాలుగు శాతం బాంండ్‌లకు కేటాయించాలని సూచిస్తున్నారు. మీ బాండ్‌ పెట్టుబడిని వివిధ కార్పొరేట్‌ ఇష్యూలతో ప్రభుత్వ బాండ్‌లగా మార్చడం మంచిది. పెట్టుబడిని మొత్తం ఒకే కార్పొరేట్‌ బాండ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకర పోర్ట్‌ఫోలియే కావొచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..