HDFC Bank: వివాదంగా మారుతోన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటన.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు
భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు, ఎగుమతిదారు. భారతదేశంలో చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర, కర్ణాటకలు అగ్రగామిగా ఉన్నాయి. భారతదేశ మొత్తం చక్కెర ఉత్పత్తిలో ఈ రెండు రాష్ట్రాలు సగం వాటా కలిగి ఉన్నాయి. అయితే ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో చెరకు పంట దిగుబడి చాలా తక్కువగా ఉంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం.. 2023-24 సీజన్‌లో భారతదేశంలో చక్కెర ఉత్పత్తి 31.7

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాడ్ వివాదం అవుతోంది. విజిల్ ఆంటీ పేరుతో HDFC రిలీజ్ చేసిన యాంటీ హిందూ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్థిక మోసాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఇటీవలి ప్రకటనల ప్రచారంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటనలో ‘విజిల్ ఆంటీ’ అని పిలవబడే ఒక మహిళ తన నుదిటిపై స్టాప్-సైన్-వంటి బిందీని కలిగి ఉంది. “విజిల్ ఆంటీ” అని పిలువబడే ఒక మహిళ స్టాప్ గుర్తును సూచించే బిందీని అలంకరించడం నెటిజన్లు ఈ ప్రకటనను ‘హిందూ వ్యతిరేకం’గా అభివర్ణించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోని నెటిజన్లు ఈ ప్రకటనపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై విరుచుకుపడ్డారు. ఎవరికి వచ్చినట్లు వారు నెటిజన్లు కామెంట్లు చేస్తూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. క్రియేలీ మీడియా ఇలా రాసింది, “మహిళా నుదుటిపై గుర్తు పెట్టుకుని మీరు హిందూ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారా? సాంస్కృతికంగా మీరు ఎంత గుడ్డివారు? మీరు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద బ్యాంక్, అలాగే భారతదేశానికి సరిగ్గా ప్రాతినిధ్యం వహించే పెద్ద బాధ్యతను మీరు కలిగి ఉన్నారు. ఇలాంటి ప్రకటనలు ఉపసంహరించుకోండి అంటూ వ్యాఖ్యానించారు. ఓ వినియోగదారు సమీర మాట్లాడుతూ, “హెచ్‌డీఎఫ్‌సీ బిందీని ఎగతాళి చేస్తోంది. దేవునికి ధన్యవాదాలు, నాకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా లేదు.” అంతకుముందు, అక్టోబర్ 14న జరిగిన ఇండియా-పాకిస్తాన్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించిన దాని ప్రకటన కోసం MakeMyTrip విమర్శలను ఎదుర్కొంది. సునీల్ కుమార్ యోగి అనే వినియోగదారు ఇలా అన్నారు, “HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ కేర్స్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తాయి? అంటూ విమర్శించారు.
HDFC making fun of bindi
Thank God I don’t have account in HDFC bank #AntiHinduHDFC pic.twitter.com/Nt1C6BA3Le
— Samira (@Logical_Girll) October 17, 2023
అయితే గత వారం మేక్‌మైట్రిప్ ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించినందుకు దాని ప్రకటనపై నిప్పులు చెరిగారు. మీ ఒక ప్రకటన కారణంగా సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సాంఘిక ప్రసార మాధ్యమం కానీ యాంటీ హిందూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఇలా హెచ్‌డీఎఫ్ సీ బ్యాంకు ప్రకటనతో తీవ్ర వివాదం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దీని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి