Ultraviolette: ఈవీ మార్కెట్‌లో కొత్త కంపెనీ దూకుడు.. ఆ వాహనాలకు యమా క్రేజ్..!
ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలు హవా కొనసాగుతోంది. ఈ విభాగంలో అనేక రకాల కొత్త స్కూటర్లు, బైక్ లను వివిధ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, మంచి రేంజ్, సూపర్ లుక్, అదిరే పికప్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అల్ట్రావైలెట్ మార్కెట్ లో తన స్థానాన్ని విస్తరించుకుంటూపోతోంది. ఈ కంపెనీ విడుదల చేసిన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మంచి ఆదరణ లభించింది. తన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటోంది. ఒడిశాలోని భువనేశ్వరంలో అత్యాధునిక ఉత్పత్తి శ్రేణిని ప్రారంభించింది.

అల్ట్రావైలైట్ కంపెనీ ద్విచక్ర వాహనాలు మంచి టెక్నాలజీతో, పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. ఖాతాదారులకు సేవలు అందించే క్రమంలో ఈ కంపెనీ భువనేశ్వరలో ఈ ఏడాది తన అత్యాధునికి అనుభవ కేంద్రాన్ని ప్రారంభించనుంది. దీనివల్ల భువనేశ్వర్ తో పాటు ఒడిశా పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది. కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నారాయణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాబోయే నెలల్లో భువనేశ్వర్ కు తమ వినూత్న ఉత్పత్తులు అందజేస్తామన్నారు. దేశమంతటా సాగనున్న తమ ప్రయాణంలో ఇది గణనీయమైన ముందడుగు అన్నారు.
ఈ కంపెనీ విడుదల చేసిన ఎఫ్ 77 మాక్2, ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ బైక్ లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువతకు నచ్చేలా చాలా అద్బుతంగా వీటిని రూపొందించారు. ఇవి కేవలం 2.8 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటాయి.. గరిష్టంగా 323 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. గంటకు155 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయి. వీటి ధర సుమారు 3 లక్షలు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.అల్ట్రావైలెట్.కామ్ వెబ్ సైట్ లో ప్రీ బుక్కింగ్ చేసుకోవచ్చు. అల్ట్రావైలెట్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ షాక్ వేర్ విడుదలయ్యాయి. వీటిలోని టెస్సెరాక్ట్ స్కూటర్ లో సెగ్మెంట్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ రాడార్, డాష్ క్యామ్ ఏర్పాటు చేశారు. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ చేంజ్, ఓవర్ టేకింగ్ అసిస్ట్, కొలిషన్ అలర్ట్ తదితర అధునాతన భద్రతా సాంకేతికతలు ఉన్నాయి. 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, ఓఆర్వీఎంలలో కూడిన వివిధ రంగుల ఎల్ఈడీ డిస్ ప్లే అమర్చారు. మంచి రైడింగ్ అనుభవం కోరుకునే వారికి షాక్ వేష్ మోటార్ సైకిల్ మంచి ఎంపిక. టెస్సరాక్ట్ స్కూటర్ రూ.1.45 లక్షలు, షాక్ వేవ్ రూ.1.75 లక్షలకు అందుబాటులో ఉన్నాయి.
2026 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలోని 50 నగరాలకు కంపెనీని విస్తరించాలని అల్ట్రావైలెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే యూకే, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ తదితర మార్కెట్లపై కూడా కన్నేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




