Indian Railways: రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు.. ఎక్కువ తీసుకెళ్తే.. నిబంధనలు ఏంటి?
Indian Railways: ఒక్కోసారి రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ఇబ్బందులు సర్వసాధారణం. ఇదంతా రైలులో లగేజీని అధికంగా ఎక్కించడమే కారణం. దీంతో రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా..

భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. అయితే రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో మీకు తెలుసా? ప్రయాణికుల సంఖ్య కంటే లగేజీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లగేజీ పరిమితిని రైల్వేశాఖ నిర్ణయిస్తుంది. కానీ, చాలా మంది ప్రయాణికులకు ఎంత పరిమితిలో లగేజీ తీసుకెళ్లవచ్చు అనే విషయం పెద్దగా తెలియదు. చాలా మంది నిబంధనలకు మించి లగేజీని తీసుకెళ్తారు. రైల్వే నివేదిక ప్రకారం.. రైలులో ఒక వ్యక్తి ఎంత లగేజీని తీసుకెళ్లాలో వివరంగా తెలిపింది.
లగేజీ విషయంలో ఓ రైల్వే అధికారిని ఓ ఇంటర్వ్యూ ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ప్రయాణికులు చాలా లగేజీలతో స్టేషన్‌లకు వస్తున్నారని, దీంతో ఒక్కోసారి రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ఇబ్బందులు సర్వసాధారణం. ఇదంతా రైలులో లగేజీని అధికంగా ఎక్కించడమే కారణం. దీంతో రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా లగేజీపై దృష్టి సారిస్తున్నాం అని తెలిపారు.
రైలులో ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చు?
రైలులోని మొదటి ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే 70 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణించాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి.
రైలులోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తే 40 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంటే సెకండ్ ఏసీలో ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు.
స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికుడు 40 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. మీరు ఇంతకంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే, రైల్వే నిబంధనల ప్రకారం మీకు జరిమానా విధిస్తారు.
ఇది కూడా చదవండి: Luxury Cars: అమెరికాకు ఎదురుదెబ్బ.. ఆ లగ్జరీ కార్ల సరఫరా నిలిపివేత!
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు రైలులో 40 నుండి 70 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇందులో ఏయే క్లాస్ బోగిల్లో ప్రయాణిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.
ఇది కూడా చదవండి: Mukesh Ambani Antilia: ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా వక్ఫ్ భూమిలో నిర్మించారా? విషయం ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి