Aadhaar Card: ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వం నుంచి అకౌంట్లోకి రూ.90 వేలు.. ఇలా అప్లై చేసుకున్నవారికి మాత్రమే..
దేశంలో నివసించే ప్రతీఒక్కరికి ఆధార్ కార్డు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి అనేక ఆర్ధిక ప్రయోజనాలు పొందవచ్చు. ఆధార్ కార్డు ఉండటం వల్ల కేంద్రం నుంచి రూ.90 వేల వరకు పొందవచ్చు. ఆ డీటైల్స్ చూద్దాం.

కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏకంగా రూ.90 వేల లోన్ పొందవచ్చు. ఈ లోన్‌ను మూడు విడతలుగా మంజూరు చేయడమే కాకుండా సకాలంలో వడ్డీ చెల్లిస్తే రాయితీతో పాటు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తారు. ఈ లోన్ తీసుకునేందుకు ఎలాంటి పూచీకత్తు లేదా ఆస్తి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చిన్నపాటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఇప్పటికే ఉన్న బిజినెస్‌ను అభివృద్ది చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం ఈ రుణం అందిస్తోంది. వీధి, చిన్న వ్యాపారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయం కల్పిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షల మంది రుణ సౌకర్యం పొందుతున్నారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి..? అర్హతలు ఏంటి..? రుణం ఎలా పొందాలి? అనే వివరాలు ఒకసారి చూద్దాం.
పీఎం స్వనిధి పథకం
వీధి వ్యాపారులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. చిరు వ్యాపారులకు ఈ స్కీమ్ ద్వారా లోన్ అందిస్తున్నారు. రూ.90 వేల వరకు రుణం పొందవచ్చు. మూడు విడతలుగా వీటిని అందిస్తారు. తొలి విడతలో రూ.10 వేలు అందిస్తారు. వీటిని తిరిగి సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ.20 వేలు లభిస్తుంది. ఇక రెండోసారి తీసుకున్నవి కూడా గడువులోగా చెల్లిస్తే మూడో విడతలో రూ.50 వరకు అందిస్తారు. ఇక మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే రూ.90 వేల వరకు కూడా తీసుకోవచ్చు.
ఈ పథకం బెనిఫిట్స్ ఇవే
-మీరు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్, ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది -కేంద్ర ప్రభుత్వం అందించే ఈ లోన్‌కు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు -కేవలం ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే సరిపోతుంది -ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు -తీసుకున్న లోన్ తిరిగి సకాలంలో చెల్లిస్తే 7 శాతం వడ్డీ రాయితీని కేంద్రం మీ అకౌంట్లో జమ చేస్తుంది -ఇక డిజిటల్ చెల్లింపులు చేస్తే క్యాష్ బాక్ కూడా అందిస్తుంది
దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే..?
-ఆన్‌లైన్‌లో పీఎం స్వనిధి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు -సమీపంలోని బ్యాంక్ లేదా సీఎస్‌సీ, మీ సేవ కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు -బ్యాంక్ అకౌంట్, ఆధార్ వివరాలు అందించాలి -దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలించి డబ్బులు మీ అకౌంట్లో వేస్తారు
