AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..

యావత్‌ దేశం 2026 బడ్జెట్ కోసం ఎదురుచూస్తోంది, ముఖ్యంగా మధ్యతరగతి వారికి పన్ను ఉపశమనం, ఉద్యోగ కల్పనపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో, ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితి పెంచడం, జీఎస్టీ నిబంధనలు సరళీకరించడం ద్వారా వినియోగాన్ని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

Budget: బడ్జెట్‌ 2026.. మధ్యతరగతికి మేలు చేస్తుందా? నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..
Budget 2026 India
SN Pasha
|

Updated on: Jan 18, 2026 | 10:19 AM

Share

యావత్‌ దేశం మొత్తం రాబోయే బడ్జెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది మన దేశపు 88వ సాధారణ బడ్జెట్‌. ఈసారి బడ్జెట్ 2026పై మధ్యతరగతి వర్గాలకు భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమనం, బలహీనమైన దేశీయ డిమాండ్ మధ్య, ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సిన ఒత్తిడిలో ఉంది. ట్యాక్స్‌ రిలీఫ్‌, ఉద్యోగ కల్పన బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా ప్రభుత్వం ఆర్థిక లోటును నియంత్రించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ బడ్జెట్ మధ్యతరగతికి శుభవార్త చెబుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

2026 బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ లభించవచ్చు. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను ఉపశమనం కల్పించారు. ఇప్పుడు పన్ను రహిత ఆదాయ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీతం పొందే తరగతికి ప్రామాణిక మినహాయింపు పెంపు కూడా చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఇది జరిగితే మధ్యతరగతి వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగిలి ఉంటుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌ను బలోపేతం చేయడం ప్రాధాన్యత కావచ్చు. పన్ను ఉపశమనంతో పాటు GST నియమాలను సరళీకరించవచ్చు. ఇది రోజువారీ ఖర్చులపై భారాన్ని తగ్గిస్తుంది.

మధ్యతరగతికి..

మధ్యతరగతి వారు 2026 బడ్జెట్ నుండి ప్రధాన ప్రకటనల కంటే చిన్నదైన కానీ ప్రభావవంతమైన నిర్ణయాలను ఆశిస్తున్నారు. ట్యాక్స్‌ రిలీఫ్‌, ఉపాధి అవకాశాలు, ద్రవ్యోల్బణ నియంత్రణ కీలకమైన అంశాలు. ప్రభుత్వం వినియోగం, ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెడితే, సాధారణ కుటుంబాలు ఉపశమనం పొందవచ్చు. బడ్జెట్ రోజున చేయబోయే ప్రకటనలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

రైల్వేలకు ప్రాధాన్యత

రేటింగ్ ఏజెన్సీలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ బడ్జెట్‌లో రైల్వేలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కొత్త రైలు మార్గాలు వేయడం, ట్రాక్‌లను డబుల్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులు గణనీయమైన ఉపాధిని సృష్టిస్తాయని భావిస్తున్నారు. మౌలిక సదుపాయాల పెట్టుబడి నిర్మాణ, సేవా రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. పరోక్షంగా మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి