AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Tips: క్రెడిట్ కార్డులు వాడేవారందరూ తెలుసుకోవాల్సిన విషయం.. ఈ చిన్న తప్పు చేస్తే ప్రమాదంలో పడ్డట్లే..

భారత్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువగా ఉంది. ఎవ్వరి దగ్గర చూసినా వ్యాలెట్లలో ఇవి కనిపిస్తున్నాయి. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్లు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది వీటిని ఉపయోగిస్తుంటే.. మరికొంతమంది డబ్బు అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

Venkatrao Lella
|

Updated on: Jan 18, 2026 | 9:47 AM

Share
క్రెడిట్ కార్డుల వినియోగం భారత్‌లో భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారస్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా వీటిని వాడుతున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడతామనే కారణంతో క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అలాగే క్రెడిట్ కార్డులు వాడి టైమ్‌కి చెల్లించడం ద్వారా సిబిల్ స్కోర్ పెరుగుతుందనే కారణంతో కొంతమంది యూజ్ చేస్తున్నారు.

1 / 5
అయితే కస్టమర్లకు క్రెడిట్ కార్డు మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు లిమిట్ విధిస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొలా క్రెడిట్ లిమిట్ అందిస్తాయి. అసలు ఈ లిమిట్‌ను బ్యాంకులు ఎలా నిర్ణయిస్తామనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఏయే అంశాలు పరిగణలోకి తీసుకుంటాయనే దానిపై చాలామందికి అవగాహన ఉండదు.

2 / 5
క్రెడిట్ కార్డు లిమిట్‌ను నిర్ణయించడంలో బ్యాంకులు మీ నెలవారీ జీతం, వార్షిక ఆదాయాన్ని పరిశీలిస్తాయి. ప్రతీ నెలా మీ అకౌంట్లో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఎంత జమ అవుతుందనే విషయాన్ని లెక్కిస్తారు. ఎక్కువ ఆదాయం మీ అకౌంట్లో జమ అవుతుంటే క్రెడిట్ లిమిట్‌ ఎక్కువగా అందిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటే లిమిట్ తక్కువగా ఇస్తారు.

3 / 5
ఇక క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను నిర్ణయించడంలో మీ సిబిల్ స్కోర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే మీరు నమ్మకమైన కస్టమర్లుగా బ్యాంకులు పరిగణిస్తాయి. దీంతో వీరికి అధిక లిమిట్‌ను ఆఫర్ చేస్తాయి. ఇక మీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం సొమ్ము ఈఎంఐలకు చెల్లిస్తుంటే క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువగా ఇవ్వరు.

4 / 5
ఒక్కసారి క్రెడిట్ కార్డు పొందిన తర్వాత మీరు లిమిట్‌ను పెంచుకోవచ్చు.  మీ జీతం పెరిగినా లేదా ఆదాయం పెరిగినా బ్యాంకులు మీకు మెస్సేజ్‌లు పంపుతాయి. ఇలాంటి సమయంలో లిమిట్ పెంపు రిక్వెస్ట్ పెట్టుకోండి. బ్యాంకులు పరిశీలించి మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను పెంచుతాయి.  అలాగే మీరు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే లిమిట్‌ను కూడా తగ్గిస్తాయి. దీంతో ఈ తప్పు చేయకండి

5 / 5