AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: బడ్జెట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టేనా?.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఉంటాయా?..

Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో యావత్ దేశ ప్రజల దృష్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై..

Budget 2022: బడ్జెట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టేనా?.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఉంటాయా?..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 10:31 PM

Share

Budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో యావత్ దేశ ప్రజల దృష్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై కేంద్రీకృతమై ఉంది. అనేక ఆర్థిక రంగాల దృష్టి బడ్జెట్ తీరుతెన్నులు ఎలా ఉంటాయనే దానిపైనే ఉది. ఈ బడ్జెట్‌లో తమకు ఏమైనా ఊరట లభిస్తుందా? అని వ్యాపార వర్గాల నుంచి సామాన్యుల వరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్థిక విధానాల రూపకల్పన కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన అంశం కానప్పటికీ.. 2022 యూనియన్ బడ్జెట్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని అంచనాలు మొదలయ్యాయి. అయితే, సంఖ్యలు, ఆర్థిక పరిభాషకు అతీతంగా.. ఆర్థిక వ్యవస్థ అంతిమంగా ప్రజలకు సంబంధించినదిగా ఉండటం ముఖ్యమని, ఆర్థికాభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో సమానంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

వర్చువల్ స్టడీతో భవిష్యత్ భయానకం..! ఇదిలాఉంటే.. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. భౌతిక భోదన నుంచి ఆన్‌లైన్ క్లాస్‌ల వైపు యావత్ ప్రపంచం మళ్లింది. తత్ఫలితంగా ప్రపంచ భవిష్యత్ సంక్షోభంలో కూరుకుపోయింది. భారతదేశంలోనే అవే పరిస్థితులు ఉన్నాయి. థర్డ్ వేవ్‌లో మునుపటి కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యార్థులకు వ్యక్తిగత తరగతులు నిర్వహించడం లేదు. వర్చువల్ తరగతుల కారణంగా విద్యార్థుల సామర్థ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే భారతదేశంలో విద్య నాణ్యత పరంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వర్చువల్ అభ్యసనం.. విద్యార్థుల భవితవ్యంపై, ప్రతిభపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత తరగతులతో అభ్యాస ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు.

డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో అసమానతలు.. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో అసమానత కూడా ఒక సమస్యగా పరిణమించింది. రెండు విద్యా సంవత్సరాల విలువైన అభ్యాస ఫలితాలను కోల్పోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపైనా దీని ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ అసమానలు, విద్యాభ్యాసంలో లోపాలు మన ఆర్థిక వృద్ధి, అభివృద్ధి పథానికి అడ్డంకులుగా మారవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఈ విధానంలో నైపుణ్యాల అసమతుల్యతే పెరుగుతుందని అంటున్నారు.

డ్రాపౌట్స్ పెరిగే ఛాన్స్.. ఇదిలాఉంటే.. మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో రాష్ట్రాల ప్రభుత్వాలు అసమర్థత కారణంగా విద్యార్థులకు తగినంత పోషకాహారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోన్న అంశంగా నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగా పాఠశాలలు పునఃప్రారంభించబడిన తర్వాత డ్రాప్-అవుట్ రేట్లు కూడా పెరుగే ఛాన్స్ ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ దానిని నిర్వహించగలిగినప్పటికీ, డ్రాప్ అవుట్ అయ్యే వ్యక్తులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందంటున్నారు.

డ్రాపౌట్స్ తగ్గుదలకు ప్రోత్సాహకాలు.. ఆర్థిక అసమానతల కారణంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది దీర్ఘ కాలంలో వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విద్యా పరిజ్ఞానం లేకుండా వారికి ఉపాధి కరువు అయ్యే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల నుంచి పేద విద్యార్థులు పాఠశాల డ్రాపౌట్స్ కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తగిన ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నగదు బదిలీ స్కీమ్.. పేద విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలని నిపుణులు పేర్కొంటున్నారు. నగదు బదిలీ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి. విద్యార్థుల హాజరు స్థాయి కూడా పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. స్కూల్‌లో చేరిన విద్యార్థి.. పాఠశాలకు నిరంతరంగా వచ్చేందుకు ప్రోత్సాహకంగా మూడు నెలలకు రూ.500 ఆ తరువాత ఆరు నెలలకు రూ. 700, విద్యా సంవత్సరం పూర్తి కాలానికి రూ. 1,000 బదిలీ చేయడం ద్వారా హాజరు శాతం పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇలా ఒక్కో విద్యాసంవత్సరానికి మొత్తం రూ.2,200 బదిలీ చేయడం ద్వారా విద్యార్థులు విద్యాలయాలకు డ్రాపౌట్ కాకుండా వచ్చే అవకాశం ఉంది.

బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చేనా?.. కరోనా కారణంగా చాలా కాలం పాటు పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో కొన్ని ఆందోళనలు రెకెత్తుతున్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేయడమే కాకుండా.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరం సవాళ్లను గుర్తించి.. వాటిని స్వీకరించి.. సమర్థంగా ఎదుర్కోవాల్సిన సంవత్సరంగా పేర్కొంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుత విద్యా విధానం.. భవిష్యత్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో.. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొని ఉంది.

Also read:

Kinnera artist Mogulaiah: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్.. ఏమిచ్చారంటే..

ఫ్రీగా బొప్పాయిలు ఇవ్వలేదని రైతును బస్సు ఎక్కించుకోని డ్రైవర్.. చివరకు ఆ రైతు ఏం చేశాడంటే..

Top Up loan: టాప్-అప్ లోన్ అంటే ఏమిటి.. ఇది గోల్డ్, పర్సనల్ లోన్ కంటే బెటరా..