AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotak Bank Customers Alert: వచ్చే వారం కోటక్ బ్యాంకు సేవలకు అంతరాయం.. ఏ సేవలో ఇప్పుడే తెలుసుకోండి..

Kotak Bank Customers Alert: ప్రైవేట్ సెక్టార్‌ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది...

Kotak Bank Customers Alert: వచ్చే వారం కోటక్ బ్యాంకు సేవలకు అంతరాయం.. ఏ సేవలో ఇప్పుడే తెలుసుకోండి..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 10:52 PM

Share

Kotak Bank Customers Alert: ప్రైవేట్ సెక్టార్‌ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంకు డెబిట్ కార్డ్ సేవలకు వచ్చే వారం అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంటే 31 జనవరి, 2022 సోమవారం నాడు ఉదయం(తెల్లవారుజామున) 1.00 గంటల నుంచి అదేరోజు తెల్లవారుజామున 4.00 గంటల వరకు బ్యాంక్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ యాక్టీవిటీలో ఉంటాయని, ఫలితంగా పలు సేవలకు అంతరాయం కలుగుతుందని కోటక్ మహీంద్రా అధికారక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ పంపించింది.

కాగా, ఈ సమయంలో.. కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లో పలు సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. అవేంటంటే. “ATM, POS, ECOM, QR, చెల్లింపు టోకనైజేషన్, కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ, PIN ప్రమాణీకరణ & PIN జనరేషన్, కార్డ్‌ బ్లాక్ చేయడం, అన్‌బ్లాక్ చేయడం, కార్డ్ నియంత్రణలు, ట్రాన్సాక్షన్ లిమిట్ అప్‌డేట్, యాక్టివేషన్, డియాక్టివేషన్.’’ వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు.

కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో దాని స్వతంత్ర నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో ₹ 1,853 కోట్ల నుండి ₹ 2,131 కోట్లకు అంటే 15% పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం డీల్స్‌లో బిఎస్‌ఇలో కోటక్ బ్యాంక్ షేర్లు 1% అధికంగా ₹ 1,916 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక నికర వడ్డీ ఆదాయం (NII) గత ఏడాది ఇదే త్రైమాసికంలో ₹ 3,876 కోట్లతో పోలిస్తే 11.8% పెరిగి ₹ 4,334 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్థిక సంవత్సరం త్రైమాసిక దాని నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.62% వద్ద ఉంది.

Also read:

Exercise: వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి.. లేకుంటే..

Hair Care Tips: నల్ల జిలకర్రతో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు చెక్.. అదెలాగంటే..!

Budget 2022: బడ్జెట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టేనా?.. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఉంటాయా?..