ఫ్రీగా బొప్పాయిలు ఇవ్వలేదని రైతును బస్సు ఎక్కించుకోని డ్రైవర్.. చివరకు ఆ రైతు ఏం చేశాడంటే..

రైతు.. మన దేశానికే వెన్నెముక. కానీ అన్నదాతలంటే కొందరికి చిన్నచూపు ఉంటుంది. ఇటీవల బోలేరో వాహనం

ఫ్రీగా బొప్పాయిలు ఇవ్వలేదని రైతును బస్సు ఎక్కించుకోని డ్రైవర్.. చివరకు ఆ రైతు ఏం చేశాడంటే..
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 29, 2022 | 3:03 PM

నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా ఆర్టీసీ డ్రైవర్ కు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో రైతు పండించిన బొప్పాయి పండ్ల ను బస్సులో తీసుకువెళ్ళకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతో గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. మారేడు మాన్ దిన్నె రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు చటమోని గోపయ్య రైతు తన వ్యవసాయ పొలంలో బొప్పాయిపండ్లు సాగుచేసి పండ్లను ప్రతిరోజు అచ్చంపేట డిపో నుండి కొల్లాపూర్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులో తనతో పాటు పండ్లకు లగేజీ టికెట్ తీసుకుని కొల్లాపూర్ పట్టణానికి తీసుకు వెళ్తాడు.

Viral News

పండ్లకు లగేజీ టికెట్ తీసుకుని కొల్లాపూర్ పట్టణానికి తీసుకు వెళ్తాడు. ఇదే క్రమంలో డ్రైవర్ కు ప్రతిసారి ఉచితంగా పండ్లను ఇస్తున్నానని ఒకరోజు మర్చిపోయి పండ్లు ఇవ్వలేదు. దీంతో బొప్పాయి పండ్లు ఇవ్వక పోయేసరికి గ్రామంలో ఈరోజు డ్రైవర్ బస్సులో తీసుకుని వెళ్లకుండా వదిలేసి వెళ్లిపోయాడు. అదే బస్సు కొల్లాపూర్ కి వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో ఆవేదనతో రైతు గోపయ్య రోడ్డుకు అడ్డంగా పండ్ల బుట్టలను ఉంచి బస్సు వెళ్లకుండా గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు గ్రామానికి రవాణా సౌకర్యం కోసం కేవలం ఒక బస్సు ఉండడంతో అది కూడా డ్రైవర్ ఎక్కించుకోకపోవడంతో తాను పండ్లను కొల్లాపూర్ తీసుకెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు ఆర్టీసీపై తనకు ఎంతో గౌరవం ఉందని ఇలాంటి డ్రైవర్ల మూలాన ఆర్టీసి సంస్థకు చెడ్డ పేరు వస్తుందని ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని ఆర్టీసీ కోసం ఎంతో కృషిచేస్తున్న ప్రస్తుత ఎండి సజ్జనార్ మరియు ఉన్నతాధికారులు స్పందించి డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని రైతులపై ఆగ్రహం కాకుండా ఆప్యాయత చూపాలని రైతు గోపయ్య కోరాడు

(సామీ, టీవీ9 రిపోర్టర్)

Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?

Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..