Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..
తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపట్ల జనం విసిగిపోయారుని..
BJP – Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనపట్ల జనం విసిగిపోయారుని.. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని జనం భావిస్తున్నరని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్, మహిళా, మైనారిటీ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల మోర్చాల ప్రతినిధులతో సుధీర్ఘంగా సమీక్షించారు. అయితే.. పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దాడులతోపాటు.. అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నందున మోర్చాల నాయకులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తూ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
యువ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగాల సాధన కోసం ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని కోరారు. ఈలోపు నిరుద్యోగులను, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. త్వరలో మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు.
దీంతోపాటు ఉద్యోగాల కల్పనపై రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించాలని.. వర్శిటీలు, హాస్టళ్ల, కోచింగ్ సెంటర్లను సందర్శించాలని కార్యకర్తలకు సూచించారు. వివిధ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి అంశాలపై ఓబీసీ మోర్చా.. దళిత బంధు, దళితులకు మూడెకరాలు, పోడు భూములు సహా దళితులు, గిరిజన మోర్చాలు, మహిళలు, మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా, మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..
Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..