AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో విద్యా వికాసానికి అడ్డుపడుతున్న కేంద్రం.. వినోద్ సంచలన ఆరోపణలు..

Telangana: తెలంగాణలో(Telangana) విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ(BJP Govt) ప్రభుత్వం మోకాలడ్డుతోందని, కొత్తగా..

Telangana: తెలంగాణలో విద్యా వికాసానికి అడ్డుపడుతున్న కేంద్రం.. వినోద్ సంచలన ఆరోపణలు..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 8:14 PM

Share

Telangana: తెలంగాణలో(Telangana) విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ(BJP Govt) ప్రభుత్వం మోకాలడ్డుతోందని, కొత్తగా విద్యా సంస్థలను(Shcools and Colleges) మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. ఏడేళ్లుగా నవోదయ(Navodaya Schools) విద్యాలయాల ఊసే ఎత్తలేదని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐ.టి, రాష్ట్రంలో ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం ఏర్పాటును కేంద్రం మరిచిందన్నారు. విద్యా సంస్థల విషయంలో బీజేపీ సర్కార్.. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదని, కనీసం సొంతంగానైనా బీజేపీ ఎంపీలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వినోద్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని, కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ ను మినహాయిస్తే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాకొకటి చొప్పున రాష్ట్రానికి మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.

కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యా పరంగా ఎంతో మేలు జరుగుతుందని వినోద్ కుమార్ వివరించారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దురదృష్ట పరిస్థితులను కల్పిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని వినోద్ కుమార్ వెల్లడించారు.

Also read:

TDP – Chandrababu: వాటి నుంచి దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త డ్రామాలు.. ప్రభుత్వంపై బాబు ఫైర్..

YSRTP: దూరం దూరంగా ఉంటున్న కీలక నేత.. బుజ్జగిస్తున్న షర్మిలమ్మ..

Budget 2022: బడ్జెట్ 2022 చిన్న.. మధ్య తరహా పరిశ్రమల వర్గాల ఆశలు నేరవేరుస్తుందా?