YSRTP: దూరం దూరంగా ఉంటున్న కీలక నేత.. బుజ్జగిస్తున్న షర్మిలమ్మ..

Telangana YSRTP: వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుండి మొన్న మొన్నటి వరకు కూడా ఆమె..

YSRTP: దూరం దూరంగా ఉంటున్న కీలక నేత.. బుజ్జగిస్తున్న షర్మిలమ్మ..
Follow us
TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 29, 2022 | 10:57 AM

Telangana YSRTP: వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన నాటి నుండి మొన్న మొన్నటి వరకు కూడా ఆమె పక్కనే ఉంటూ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న కొండా రాఘవ రెడ్డి ఇప్పుడు ఎక్కడా షర్మిల క్యాంపులో కనిపించడం లేదు. ఆదిలో అంతా తానై వ్యవహరించిన కొండా.. ఇప్పుడు కొండత దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి నిర్ణయంలో తన పాత్ర ఉండే కొండాకు.. అక్కడ అనుకున్న ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారట. కార్యకర్తలు, నాయకులు కావాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవడం, దివంగత వైఎస్ఆర్ శత్రువులతో అర్థం లేకుండా స్నేహ హస్తం ఇవ్వడం లాంటివి కొండా కు రుచించ లేదని అయిన వర్గం చెప్తోంది.

అయితే ఇప్పటికే పెద్ద నాయకులు లేక ఇబ్బంది పడ్తున్న షర్మిల పార్టీకి ఇప్పుడు కొండా కూడా దూరం అవ్వడం పార్టీలో కలకలం రేపుతోంది. కొండా దూరం.. పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధినాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొండా రాఘవ రెడ్డిని బుజ్జగించేందుకు వైఎస్ విజయలక్ష్మి ఎంటరైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొండాను విజయమ్మ సముదాయిస్తున్నారట. ఇదే అంశంపై చర్చించేందుకు కొండాను కలవాల్సిందిగా కబురు పంపారట వైఎస్ విజయమ్మ.

ఇక ఇందిరా శోభన్ కూడా ఇలాగే పార్టీలో ఆక్టివ్ గా ఉంటూ సడన్ గా రాజీనామా ప్రకటించారు. కొండా కూడా అదే బాటలో వెళ్తారా లేక బుజ్జగింపులకు తలొగ్గి ఉంటారా అనేది చూడాలి

– అగస్త్య, టీవీ9 రిపోర్టర్.

Also read:

Budget 2022: బడ్జెట్ 2022 చిన్న.. మధ్య తరహా పరిశ్రమల వర్గాల ఆశలు నేరవేరుస్తుందా?

Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత.. ప్రతీ 18 నిమిషాలకొకసారి..

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..