AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత.. ప్రతీ 18 నిమిషాలకొకసారి..

Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో..

Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత.. ప్రతీ 18 నిమిషాలకొకసారి..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 7:56 PM

Share

Space Radio Waves: పాలపుంతలో అంతుచిక్కని వింత ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో అర్థం కాక సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకెళితే.. ఈ అనంతమైన విశ్వంలో లెక్కలేనన్ని పాలపుంతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో మన పాలపుంత కూడా ఒకటి. అయితే, గతంలో ఎన్నడూ చూడని వస్తువును తాజాగా మన పాలపుంతలో గుర్తించారు ఆస్ట్రేలియాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు. ఈ వింత ఆబ్జెక్ట్ నుంచి ప్రతీ 18 నిమిషాలకొకసారి ఒక నిమిషం పాటు భారీ రేడియో తరంగాలు వెలువడుతుండటాన్ని గమనించారు. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అంతరిక్షంలో అంతుపట్టిన వస్తువు నుంచి భారీగా రేడియో ఎనర్జీ విడుదల అవుతోందని వెల్లడించారు. విశ్వంలో శక్తిని విడుదలచేసే ఆబ్జెక్ట్స్ ఉండటం సాధారణమే. అయితే, నిమిషంపాటు నిరంతరంగా రేడియో ధార్మికతను విడుదల చేయడం అసాధారణమైన విషయమంటున్నారు సైంటిస్టులు.

కనిపిస్తూ అదృశ్యమవుతున్న ఆబ్జెక్ట్.. ఈ వింత ఆబ్జెక్ట్‌ను తొలిసారిగా ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ విద్యార్థి టైరోన్ ఓ డోహెర్టీ చూశారు. టెలీస్కోప్ వాడుతూ, తాను అభివృద్ధిచేసిన కొత్త టెక్నిక్ ద్వారా దీనిని గుర్తించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రీసెర్చ్(ఐసీఆర్ఏఆర్) ఆస్ట్రో ఫిజిసిస్ట్ డాక్టర్ నటాషా హర్లీ వాకర్ నేతృత్వంలో పని చేస్తున్న బృందంలో సభ్యుడు ఈ డోహెర్టీ. ఇది కొంచెం సేపు కన్పించి మాయమవుతోందని డాక్టర్ నటాషా తెలిపారు. ఇలాంటి ఆబ్జెక్ట్ ను చూస్తామని ఖగోళ శాస్త్రవేత్తలుగా తాము అనుకోలేదని వ్యాఖ్యానించారు ఆమె. ఆకాశంలో ఇలాంటిది ఇప్పటి వరకు చూడలేదన్న నటాషా బృందం పేర్కొంది. అంతరిక్షంలో అప్పుడప్పుడూ కనిపించి మాయమైపోయే ఆబ్జెక్ట్ లను చూడటం కొత్త కాదని, ఇటువంటి ఆబ్జెక్ట్ లను ట్రాన్సియెంట్లని పిలుస్తారని నటాషా బృందం పేర్కొంది. అయితే, ఒక నిమిషం సేపు వెలుగుతూ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ను చూడటం మాత్రం పూర్తిగా విచిత్రం అంటున్నారు ఐసిఆర్ఏఆర్ కర్టిన్ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ గెమ్మ ఆండర్సన్.

నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో.. కాగా, ఈ వింత ఆబ్జెక్ట్ భూమికి నాలుగువేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు గుర్తించారు సైంటిస్టులు. ఈ దూరాన్ని గణించడానికి గత కొన్నేళ్లుగా సేకరించిన డేటాను ఉపయోగించింది ఐసీఆర్ఏఆర్. ఈ ఆబ్జెక్ట్ ప్రకాశవంతంగా మెరుస్తోందని వెల్లడించారు. అంతేకాక, దీనిపై బలమైన అయాస్కాంత క్షేత్రాలున్నాయన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంచనాలు, సిద్ధాంతాల ప్రకారం ఈ అబ్జెక్ట్ ఒక తెల్లని కుబ్జ(మరుగుజ్జు) నక్షత్రం లేదా న్యూట్రాన్ స్టార్ కావచ్చని అంటున్నారు.

కుబ్జ నక్షత్రం అంటే.. కుబ్జ నక్షత్రం అంటే కాల క్రమేణ జ్వలించే గుణం క్షీణించే పరిస్థితిలో ఉన్న నక్షత్రం అని అర్థం. మృతిచెందిన నక్షత్రమే వైట్ డ్వార్ఫ్. వైట్ డ్వార్ఫ్ నక్షత్రాలు వేడిగా ఉన్నప్పటికీ వీటిల్లో శక్తి ఉత్పత్తి అంటే కేంద్రక సంలీనం జరుగదు. క్రమ క్రమంగా చల్లబడుతూ చివరికి వైట్ డ్వార్ఫ్ శీతలమైన బ్లాక్ డ్వార్ప్ గా మారుతాయి. ఈ ప్రక్రియకు 13.8బిలియన్ సంవత్సరాలు పడుతుందని అంచనా. మన పాలపుంతలో సూర్యునికి సమీపంలో ఉన్న 100 నక్షత్రాల వ్యవస్థల్లో 8 వైట్ డ్వార్ఫ్ లను గుర్తించారు శాస్త్రవేత్తలు.

కుబ్జ నక్షత్రమా? వేరే సిగ్నల్సా..? అయితే, ఇది కుబ్జ నక్షత్రమేనా లేక ఇతర గ్రహాల నుంచి వస్తున్న సిగ్నల్సా అన్న ప్రశ్న శాస్త్రవేత్తలను తొలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సిగ్నల్స్ ఏంటని తేల్చే పనిలో పడ్డారు పరిశోధకులు. ముఖ్యంగా మన పాలపుంతలో ఇతర గ్రహ వాసులకు సంబంధించిన సిగ్నల్సా అన్నది తేలాల్సి ఉంది. పాలపుంతలో 400 బిలియన్ నక్షత్రాలుంటాయని అంచనా. మరి నిమిషంపాటు వెలుగుతూ ఆరిపోతున్న ఈ ఆబ్జెక్ట్ ఏంటో కనిపెట్టగలరా? ఇది వెలుగుతూ కన్పించి ఆ తరువాత మాయమవటం వెనక మర్మమేమిటో తేల్చగలరా? మరిన్ని పరిశోధనలు జరిగితేకాని పూర్తి వివరాలు తెలుస్తుంది.

Also read:

Indian Political Parties: రూ. 4,847.78 కోట్ల ఫండ్‌తో టాప్‌లో బీజేపీ.. సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ మాత్రం కాదు..!

BBL Final: 25 పరుగులకే 4 వికెట్లు.. కట్ చేస్తే.. ఇద్దరు బ్యాటర్ల పెను విధ్వంసం.. చివరికి ట్రోఫీ కైవసం.!

IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి పేరు నమోదు చేసుకున్న భూటాన్ క్రికెటర్.. ఎవరంటే..