AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BBL Final: 25 పరుగులకే 4 వికెట్లు.. కట్ చేస్తే.. ఇద్దరు బ్యాటర్ల పెను విధ్వంసం.. చివరికి ట్రోఫీ కైవసం.!

పెర్త్ జట్టు విజయంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్రలు పోషించారు. వారిలో ఒకరు కెప్టెన్ అష్టన్ టర్నర్, మరొకరు ఇంగ్లాండ్ ప్లేయర్ లారీ ఎవాన్స్...

BBL Final: 25 పరుగులకే 4 వికెట్లు.. కట్ చేస్తే.. ఇద్దరు బ్యాటర్ల పెను విధ్వంసం.. చివరికి ట్రోఫీ కైవసం.!
Perth Scoheres
Ravi Kiran
|

Updated on: Jan 28, 2022 | 6:06 PM

Share

ఆస్ట్రేలియా టీ20 టోర్నమెంట్ బిగ్ బాష్ లీగ్ 2021-22 సీజన్ ముగిసింది. జనవరి 28వ తేదీ మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పెర్త్ స్కార్చర్స్ అద్భుత విజయాన్ని అందుకుని ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే.. పెర్త్ జట్టు విజయంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్రలు పోషించారు. వారిలో ఒకరు కెప్టెన్ అష్టన్ టర్నర్, మరొకరు ఇంగ్లాండ్ ప్లేయర్ లారీ ఎవాన్స్. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ ఎంచుకున్న సిడ్నీ జట్టుకు.. బౌలర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. పెర్త్ జట్టు టాప్ 4 బ్యాటర్లను మొదటి 6 ఓవర్లలో కేవలం 25 పరుగులకే పెవిలియన్‌కు చేర్చారు. ఈ పతనంలో సిడ్నీ బౌలర్లు లియాన్, స్టీవ్ ఒకీఫ్ భాగస్వామ్యాన్ని పంచుకుని.. చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మరోవైపు పెర్త్ జట్టుకు పేలవమైన ఆరంభం ఎదురైనప్పటికీ.. కెప్టెన్ టర్నర్, ఇవాన్స్ కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఇద్దరూ కలిసి 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇవాన్స్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు చేయగా.. కెప్టెన్ టర్నర్ 35 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 54 పరుగులు చేశాడు. వీరి అద్భుత ఇన్నింగ్స్‌లతో పెర్త్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగుల పటిష్ట స్కోరు సాధించింది. ఫలితంగా టార్గెట్‌ను చేధించే క్రమంలో సిడ్నీ 92 పరుగులకే ఆలౌట్ అయింది. పెర్త్ బౌలర్లలో టై 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌సన్ 2 వికెట్లు.. బెహ్రెన్‌డ్రూఫ్, టర్నర్, పీటర్, అగర్ చెరో వికెట్ పడగొట్టారు.