AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kinnera artist Mogulaiah: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్.. ఏమిచ్చారంటే..

Kinnera artist Mogulaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని రీతిలో సాయం ప్రకటించారు.

Kinnera artist Mogulaiah: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ ఊహించని గిఫ్ట్.. ఏమిచ్చారంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 28, 2022 | 8:53 PM

Share

Kinnera artist Mogulaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని రీతిలో సాయం ప్రకటించారు. ప్రభుత్వం తరఫున హైద్రాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ప్రకటించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్య ను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు సీఎం కేసీఆర్. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి అంశంపై మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు కూడా మొగిలయ్య వెంట ఉన్నారు.

Also read:

Hyderabad: అక్రమ కట్టడాలపై టాస్క్‌ఫోర్స్ కొరడా.. కొనసాగుతున్న కూల్చివేతలు..

Inequality: ఇండియాలో పెరిగిన ఆర్థిక అసమానత.. బిలియనీర్లలో మూడో స్థానంలో ఉన్న దేశం..

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే తోపు.! ట్రై చేయండి..