Hyderabad: అక్రమ కట్టడాలపై టాస్క్‌ఫోర్స్ కొరడా.. కొనసాగుతున్న కూల్చివేతలు..

హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతోన్నాయి. అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపించింది టాస్క్ ఫోర్స్ విభాగం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ..

Hyderabad: అక్రమ కట్టడాలపై టాస్క్‌ఫోర్స్ కొరడా.. కొనసాగుతున్న కూల్చివేతలు..
Crackdown On Illegal Constructions
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 28, 2022 | 8:46 PM

హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతోన్నాయి. అక్రమ కట్టడాలపై(Illegal Structures) కొరడా ఝలిపించింది టాస్క్ ఫోర్స్ విభాగం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలను చేపట్టాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను శుక్రవారం అధికారులు కూల్చివేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 500 చదరపు గజాల కు మించిన స్థలాల్లో జి ప్లస్ టు (G+2) నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వాటిపై అక్రమంగా మరో రెండు, మూడు అంతస్తులు నిర్మించడంమే కాకుండ వాటి మధ్య “పెంట్ హౌస్” నిర్మాణాలు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించి వాటిని శుక్రవారం కూల్చివేశారు.

నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి నగర్ లో 300 చదరపు గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు (షాపింగ్ షట్టర్లు)జరపడం, వాటిలో ఒక షట్టర్ లో లిక్కర్ షాపు పనిచేస్తుండాన్ని గుర్తించి అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజాంపేట్ లో 630 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ ప్లస్ టు(G+2) నిర్మాణానికి అనుమతి పొంది వాటిపైన అదనంగా మూడు(3) అంతస్తులు, దానిపైన “పెంట్ హౌస్” ను గుర్తించి టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం వాటిని కూల్చివేశారు.

ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ సంయుక్తంగా 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంది. వాటిలో 84 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు మరో 23 అక్రమ నిర్మాణాలను అధికారులు సీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి: Viral Video: స్నేహం అంటే ఇదే రా.. స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఫ్రెండ్‌ను రక్షించిన కుక్క..

Viral Video: ఈ మేకకు ఏమైనా శక్తులున్నాయా..? వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజనం..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!