AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Saving Schemes: డబ్బు దాచుకునేందుకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!

డబ్బు దాచుకునేందుకు బ్యాంకుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థల వరకూ చాలా రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా.. మీ డబ్బు సేఫ్ గా ఉంటూనే మంచి వడ్డీ కూడా కావాలనుకుంటే.. ఈ స్కీమ్స్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కీమ్స్‌ వివరాలు? వాటి బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Saving Schemes: డబ్బు దాచుకునేందుకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ ఇవే!
Best Saving Schemes
Nikhil
|

Updated on: Sep 18, 2025 | 6:08 PM

Share

చాలామంది సంపాదిస్తున్న డబ్బుని బ్యాంక్ అకౌంట్‌లో అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి నష్టం లేదు.. అలాగని లాభం కూడా లేదు. అందుకే డబ్బు దాచుకునేందుక సేవింగ్స్ స్కీమ్స్‌ను వాడుకోవాలి. వీటిలో కాస్త ఎక్కువ వడ్డీ  రావడంతో పాటు లాంగ్ టర్మ్‌లో ఎక్కువ సేవ్ చేసుకునే వీలుంటుంది. అలాంటి బెస్ట్ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేషనల్ సేవింగ్స్ టైం డిపాజిట్

ఈ ప్రభుత్వ పథకంలో నచ్చిన టై పీరియడ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఒక ఏడాది నుంచి  ఐదేళ్ల పాటు సేవింగ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో వడ్డీ రేటు 6.7 శాతం వరకూ ఉంటుంది. రూ.1000 నుంచి పొదుపు చేసుకోవచ్చు. మ్యాగ్జిమం లిమిట్ లేదు.

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్

పోస్టాఫీస్ సేవింగ్ అకౌంట్‌లో పొదుపు చేయడం ద్వారా 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్ కు టైం పీరియడ్ అంటూ ఏమి లేదు. ఎంత కాలమైనా సేవ్ చేసుకోవచ్చు.  ఇందులో రూ. 500 నుంచి మ్యాగ్జిమం ఎంతైనా  సేవింగ్ చేసుకోవచ్చు. ఇందులో పన్ను రాయితీలు కూడా ఉంటాయి.

నేషనల్ పెన్షన్ ప్లాన్

ఉద్యోగాలు చేసేవాళ్లకు ఈ స్కీమ్ మంచి ఆప్షన్. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో డబ్బు పొందడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.  నెలనెలా కొంత సేవ్ చేస్తుండడం ద్వారా రిటైర్ అయిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.  అలాగే మిగిలిన మొత్తాన్ని ప్రతినెలా పింఛనుగా కూడా పొందొచ్చు. ఇందులో కనీస డిపాజిట్ రూ.500.  మ్యాగ్జిమం లిమిట్ లేదు. ఇందులో వడ్డీ 9 శాతం నుంచి 12 శాతం వరకూ ఉంటుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌తో నెల‌నెలా ఆదాయాన్ని పొందొచ్చు. ఇదొక మంచి పెట్టుబడి పథకం. ఇందులో క‌నీసం రూ.1,000 నుంచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఇండివిడ్యువల్ అకౌంట్ అయితే రూ.4.50 ల‌క్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 ల‌క్షల వరకూ పెట్టుబ‌డి పెట్టుకోవచ్చు. ఇందులో 6.60 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి నెలా వ‌డ్డీని పొందే వీలుంటుంది. ఈ స్కీమ్ కు ఐదేళ్ల మినిమం లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్లపాటు తప్పక పెట్టుబడి పెట్టాలి.

మహిళా సమ్మాన్ సేవింగ్స్

మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్ ఇది. ఇది రెండు సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తుంది. సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటు అందుతుంది. షార్ట్ టర్మ్ పెట్టుబడులకి ఇది బెస్ట్ స్కీమ్. ఆడవాళ్లు తమ డబ్బుని దాచుకోడానికి, అవసరానికి తగ్గట్టుగా విత్ డ్రా చేసుకోవడానికి ఈ స్కీమ్ ను ఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

Follow Us