Toyota ePalette: సెటప్ అదిరింది! పగలు వ్యాన్.. రాత్రికి థియేటర్!
పగలు జర్నీ చేసే కారుగా రాత్రికి సినిమా చూసే థియేటర్ గా.. అవసరమైతే వంట చేసుకునే కిచెన్ గా.. ఇలా రకరకాలుగా మారిపోయే కారుని ఎప్పుడైనా చూశారా? జపానీస్ ఆటోమొబైల్ దిగ్గజం టొయొటా.. ఇలాంటి ఓ విన్నూత్నమైన వ్యాన్ ను డిజైన్ చేసింది. దీని గురించి తెలుసుకుంటే ఎవరైనా వావ్ అనాల్సిందే..

టయోటా సంస్థ గత కొన్నేళ్లుగా మల్టి యుటిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ పై పనిచేస్తుంది. ఇ–ప్యాలెట్ అనే ఈ ఎలక్ట్రిక్ వ్యాన్.. ఒకే సమయంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉదయం జర్నీ చేసే బస్సుగా, సాయంత్రం సినిమా చూసే థియేటర్‌గా, రాత్రి భోజనం తయారుచేసే కిచెన్ గా.. ఇలా రకరకాలుగా వాడుకొవచ్చు.
డిజైన్, ఫీచర్లు
టొయొటా ఈ వ్యాన్ పై 2018 నుంచి పనిచేస్తుంది. ఎట్టకేలకు రీసెంట్ గా జపాన్ లాంఛ్ చేసింది. ఇందులో 72.82 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే 40 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ వ్యాన్ గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఇందులో లిడార్(LiDAR), కెమెరాలు, ఆటోమేటెడ్ డ్రైవింగ్ కిట్, స్టీర్ బై వైర్ వంటి లేటెస్ట్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ఈ వ్యాన్ లో డ్రైవర్‌తో కలిపి మొత్తం 17 మంది ప్రయాణించవచ్చు. ఈ వ్యాన్ 4950 మి.మీ. పొడవు, 2080 మి.మీ. వెడల్పు, 2650 మి.మీ. ఎత్తు ఉంటుంది. బరువు 2950 కిలోలు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వ్యాన్ మాన్యువల్ డ్రైవింగ్ మోడ్ తో నడుస్తుంది. ఫ్యూచర్ లో సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు టొయొటా ప్లాన్ చేస్తోంది.
రకరకాలుగా వాడొచ్చు
ఈ వ్యాన్ ను అవసరాలకు తగ్గట్టుగా రకరకాలుగా వాడుకోవచ్చు. 17 మంది జర్నీ చేసే వ్యాన్ గానే కాకుండా ఫుడ్ ట్రక్, మొబైల్ రెస్టారెంట్, చిన్న థియేటర్ లాగా కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఇందులో పెద్ద డిజిటల్ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా వెరైటీగా బాక్స్ షేప్ లో ఉంటుంది. ఇది లో ఫ్లోర్ డిజైన్‌తో రూపొందించబడింది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద స్లైడింగ్ డోర్లు ఉంటాయి. దీనివల్ల సులభంగా ఎక్కొచ్చు, దిగొచ్చు.ఈ వ్యాన్ రీసెంట్ గా జపాన్ లో లాంఛ్ అయింది. దీని ధర జపనీస్ కరెన్సీలో 29 మిలియన్ యెన్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.70 కోట్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




