AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC: వావ్.. రూపాయికే ఏసీ బుకింగ్.. జీఎస్టీ తగ్గింపుతో సూపర్ డీల్స్ ప్రకటించిన కంపెనీలు.. మస్త్ పైసలు ఆదా..

జీఎస్టీ తగ్గింపుతో సెప్టెంబర్ 22 నుంచి ఎలక్ట్రానిక్స్ రేట్లు తగ్గనున్నాయి. కొత్త ఏసీలపై వేల రూపాయలు తగ్గనున్నాయి. అయితే కొత్త రేట్లు అమల్లోకి రాకముందే డీలర్లు, కంపెనీలు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించారు. కేవలం రూపాయికే ప్రీ బుకింగ్స్ మొదలు పెట్టాయి.

AC: వావ్.. రూపాయికే ఏసీ బుకింగ్.. జీఎస్టీ తగ్గింపుతో సూపర్ డీల్స్ ప్రకటించిన కంపెనీలు.. మస్త్ పైసలు ఆదా..
Pre Book Your New Ac For Rs 1
Krishna S
|

Updated on: Sep 18, 2025 | 3:09 PM

Share

ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. నిత్యావసరాల నుంచి మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు రేట్లు తగ్గనున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో ఎయిర్ కండీషనర్ల తయారీదారులు, డీలర్లు అడ్వాన్స్ బుకింగ్‌లను ప్రారంభించారు. జీఎస్టీ తగ్గింపుతో ఏసీలకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తూ.. ఈ ముందస్తు బుకింగ్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ కండీషనర్లపై 28శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అయితే సెప్టెంబర్ 22 నుండి ఇది 18శాతానికి తగ్గనుంది. దీనివల్ల ఏసీ ధరలు గణనీయంగా తగ్గుతాయి. బ్లూ స్టార్, హైయర్ ఈ ధర తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించాయి. దీని ఫలితంగా ఒక్కో ఏసీపై మోడల్‌ను బట్టి రూ.4,000 వరకు ఆదా అవుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

రూ.1కే ఏసీ ప్రీ-బుకింగ్

హైయర్ సంస్థ కేవలం రూ.1 చెల్లించి ఏసీలను ప్రీ-బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనితో పాటు ఎంపిక చేసిన చెల్లింపులపై 10శాతం వరకు క్యాష్‌బ్యాక్, ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఉచిత ఇన్‌స్టాలేషన్, గ్యాస్ ఛార్జింగ్‌తో ఐదేళ్ల పూర్తి వారంటీ, సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. సెప్టెంబర్ 10 నుండి 21 వరకు ఈ బుకింగ్ విండో అందుబాటులో ఉంటుందని హైయర్ తెలిపింది. ఈ సంస్థ తమ 1.6-టన్నుల 5-స్టార్ ఏసీ ధరను రూ.3,905, అలాగే 1.0 టన్నుల 3-స్టార్ ఏసీ ధరను రూ.2,577 తగ్గించింది.

ఏసీ పరిశ్రమలో కొత్త ఆశలు

జూన్ త్రైమాసికంలో అకాల వర్షాల కారణంగా ఏసీ అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు ఈ ధర తగ్గడాన్ని అవకాశంగా మలుచుకునేందుకు కంపెనీలు చూస్తున్నాయి. సులభమైన ఫైనాన్స్, ఉచిత ఇన్‌స్టాలేషన్, వారంటీ పొడిగింపు, జీరో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. కస్టమర్లు నుండి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. డీలర్లు అడ్వాన్స్ బుకింగ్‌లు తీసుకుంటున్నప్పటికీ, కొత్త జీఎస్టీ రేటు అమల్లోకి వచ్చే సెప్టెంబర్ 22న మాత్రమే బిల్లులు జారీ చేస్తారని ఆయన వివరించారు. ఈ జీఎస్టీ తగ్గింపుతో ఏసీ అమ్మకాలు ఊపందుకుంటాయని ఏసీ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..