AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual fund SIP: కోటి రూపాయలు కావాలంటే ఎంత సిప్(SIP) కట్టాలి?

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఎక్కువగా సిప్ (SIP) పద్ధతిలో పెట్టుబడి పెడుతుంటారు. అయితే కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత సిప్ చేయాల్సి ఉంటుంది? ఎన్నేళ్ల పాటుచేయాల్సి ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? సరే ఇప్పుడు లెక్క కట్టి చూద్దాం.

Mutual fund SIP: కోటి రూపాయలు కావాలంటే ఎంత సిప్(SIP) కట్టాలి?
Mutual Fund Sip
Nikhil
|

Updated on: Sep 18, 2025 | 1:38 PM

Share

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్టుబడి విధానాల్లో సిప్ (SIP) చాలా సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్. అయితే చాలామంది సిప్ అంటే రికరింగ్ డిపాజిట్ లాంటి స్కీమ్ అనుకుంటారు. కానీ, సిప్ తో ఉండే ప్రయోజనాలు తెలిస్తే సిప్ కట్టకుండా ఉండలేరు.

సిప్ అంటే..

సిప్ మనదేశంలో చాలా పాపులర్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్. అంటే ప్రతి నెలా కొంత చొప్పున మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే పద్ధతి. ఈ తరహా పెట్టుబడుల ద్వారా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ను పొందే వీలుంటుంది.   వంద రూపాయల నుంచి లక్షల వరకూ ఎంతైనా సిప్ విధానంలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత సిప్ కట్టాలి?  ఎన్నేళ్ల పాటు కట్టాలో ఒక లెక్క వేసి చూద్దాం.

నెలకు రూ. 5,000 

నెలకు  రూ. 5,000 చొప్పున సిప్ కడుతూ..  ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోవాలి. అంటే రెండో ఏడాది నెలకు 5500 కట్టాలి. ఇలా పది శాతం పెంచుకుంటూ పోవాలి. దీన్నే స్టెప్-అప్‌ పాలసీ అంటారు. ఇలా సిప్ కడుతూ ఉంటే.. 12 శాతం రిటర్న్స్ గనుక వస్తే.. 20 ఎళ్లలో మీరు కోటి రూపాయల మార్క్ అందుకుంటారు.

నెలకు రూ. 3,000 

ప్రతి నెలా రూ. 3,000 సిప్ కడుతూ.. 10 శాతం స్టెప్ అప్ తో.. 12 శాతం రిటర్న్స్ వస్తే.. మీరు 24 సంవత్సరాలలో రూ.కోటి మార్క్ చేరుకుంటారు.

నెలకు రూ. 2,000

సంవత్సరానికి 10 శాతం స్టెప్-అప్‌తో, నెలవారీ రూ. 2,000 సిప్ కడుతూ ఉంటే.. ప్రతి సంవత్సరం 12 శాతం రిటర్న్స్ కనుక వస్తే.. మీరు 27 సంవత్సరాలలో రూ. కోటి సంపాదిస్తారు.

నెలకు రూ. 1,000

ప్రతి నెలా రూ.1,000 చొప్పున సిప్ కడుతూ..  10 శాతం స్టెప్-అప్‌తో.. 12 శాతం రిటర్న్స్  సాధిస్తే.. కోటి రూపాయలు సంపాదించడానికి సుమారు 30 ఏళ్లు పడుతుంది.

డాక్యుమెంట్స్ చదివాకే..

మీమీ అవసరాలు లక్ష్యాలను బట్టి సిప్ అమౌంట్ ను పెంచుకుంటూ లేదా తగ్గిస్తూ పోవచ్చు. రూ.10,000 కంటే ఎక్కువ సిప్ చేయగలిగితే ఇంకా త్వరగానే కోటి రూపాయల మార్క్ అందుకోవచ్చు. అయితే మ్యూచువల్‌ ఫండ్స్ రిటర్న్స్ అనేవి ఫిక్స్ డ్ గా ఉండవు. ఒకవేళ మార్కెట్ అనుకూలంగా ఉంటే లాభాలు వస్తాయి. లేదా నష్టాలు కూడా రావొచ్చు. ఏదైనా సిప్ లేదా మ్యూచువల్ ఫండ్ కట్టేముందు ఆయా పాలసీ డాక్యుమెంట్లు చదివి నిర్ణయ-ం తీసుకోవడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి