AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య డబుల్.. ఎంత మంది ఉన్నారో తెలుసా..?

భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి నిదర్శనంగా దేశంలో కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2021 తర్వాత సంపన్నుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య డబుల్.. ఎంత మంది ఉన్నారో తెలుసా..?
India's Millionaire Population Almost Doubles
Krishna S
|

Updated on: Sep 18, 2025 | 6:20 PM

Share

దేశంలో సంపన్నుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన మెర్సిడెస్-బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం.. గత నాలుగేళ్లలో కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య దాదాపు 90శాతం పెరిగింది. అంటే గతంలో సంపన్నులుగా ఉన్న వారి సంఖ్య ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువగా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. రూ.8.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన కుటుంబాల సంఖ్య 4.58 లక్షల నుండి 8.71 లక్షలకు పెరిగింది. ఇప్పుడు దేశంలోని మొత్తం కుటుంబాలలో 0.31శాతం ఫ్యామిలీస్ కోటీశ్వరులుగా ఉన్నాయి. 2017 నుండి 2025 మధ్య కాలంలో ఈ సంఖ్య ఏకంగా 445శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. స్టాక్ మార్కెట్ లాభాలు, కొత్త వ్యాపారాల వృద్ధి, ఆర్థిక పురోగతి ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణాలు.

ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది కోటీశ్వరులు..?

రాష్ట్రాల పరంగా చూస్తే.. మహారాష్ట్ర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 1,78,000 కంటే ఎక్కువ కుటుంబాలు కోటీశ్వరులు. ముఖ్యంగా ముంబై 1,42,000 కోటీశ్వరుల కుటుంబాలతో దేశ మిలియనీర్ రాజధానిగా మారింది. దీని తర్వాత 79,800 కుటుంబాలతో ఢిల్లీ రెండవ స్థానంలో, 72,600 కుటుంబాలతో తమిళనాడు మూడవ స్థానంలో ఉన్నాయి.

ఈ నగరాల్లో వేగంగా..

ఢిల్లీ తర్వాత బెంగళూరులో కూడా కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బెంగళూరులో ఇప్పుడు దాదాపు 31,600 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. అంతేకాకుండా అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి నగరాలు కూడా ఆర్థిక కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నగరాలలో కూడా రోజురోజుకూ కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది.

హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. దేశంలో సంపద పెరుగుదల వేగంగా ఉందని తెలిపారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 1.7 మిలియన్ల నుండి 2 మిలియన్ల వరకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. అయితే ఈ వృద్ధి ఎక్కువగా మధ్యస్థాయి కోటీశ్వరుల వర్గంలో ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?