IRCTC Fake App: ఆ యాప్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా..? ఆ విషయం చెక్ చేసుకోవాల్సిందే..!

భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా చౌకైన రవాణా సాధనంగా రైలు ప్రయాణం ఉంది. ఉన్నత వర్గాలకు చెందిన వారితో పాటు పేద ప్రజలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. ప్రమాదరహితంగా ఉండడంతో పాటు తక్కువ ధరలో ప్రయాణించే వీలు ఉండడంతో ఎక్కువ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వివిధ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్ని యాప్స్ ఉన్నా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

IRCTC Fake App: ఆ యాప్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా..? ఆ విషయం చెక్ చేసుకోవాల్సిందే..!
Irctc
Follow us

|

Updated on: Oct 11, 2024 | 4:30 PM

భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా చౌకైన రవాణా సాధనంగా రైలు ప్రయాణం ఉంది. ఉన్నత వర్గాలకు చెందిన వారితో పాటు పేద ప్రజలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తారు. ప్రమాదరహితంగా ఉండడంతో పాటు తక్కువ ధరలో ప్రయాణించే వీలు ఉండడంతో ఎక్కువ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇటీవల కాలంలో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వివిధ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్ని యాప్స్ ఉన్నా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది అనేక సేవలను అందిస్తుంది. ప్రతిరోజూ లక్షల మంది ఈ అప్లికేషన్ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. ఈ యాప్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా మోసగాళ్లు ఫేక్ ఐఆర్‌సీటీసీ యాప్స్ క్రియేట్ చేసి యూజర్ల సొమ్మును తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో నకిలీ ఐఆర్‌సీటీసీ అప్లికేషన్లు పుట్టగొడుగుల్లా పెరిగాయి. ఏది నకిలీ? ఏది నిజమో? కనిపెట్టడం కష్టంగా మారింది. ఒకటి రెండు కాదు.. నకిలీ ఐఆర్‌సీటీసీ అప్లికేషన్ల సంఖ్య వందల్లో ఉందని ప్రముఖ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఫేస్‌బుక్‌తో సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ అప్లికేషన్‌లకు లింక్‌లు కనిపిస్తాయి. కొన్నిసార్లు మీ మొబైల్ నంబర్‌కు కూడా సందేశాలు వస్తాయి. ‘ఐఆర్‌సీటీసీ కొత్త ఆఫర్లు ఇస్తోంది. బంపర్ రివార్డ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈరోజే చివరి రోజు, ఈ క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి ఆఫర్‌ను పొందండి’ ఇలాంటి అనేక ప్రకటనలు మొబైల్‌లో వస్తాయి. ఆఫర్ అనేసరికి నకిలీ ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌ను తెరిచి బ్యాంకు ఖాతా, లొకేషన్ సహా చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మన ఇచ్చిన సమాచారంతో మోసగాళ్లు మన బ్యాంకు ఖాతా నుంచి సొమ్మును తస్కరిస్తున్నారు. 

నకిలీ యాప్స్ నివారించడం ఇలా

మీరు ఐఆర్‌సీటీసీకు సంబంధించిన రైల్ కనెక్ట్ అప్లికేషన్‌ను అధికారిక యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. వాట్సాప్ లేదా మెసేజెస్ ఐఆర్‌సీటీసీ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఏ ప్రభుత్వ సంస్థ లింక్‌లను పంపదు. మీరు ఐఆర్‌సీటీసీ అప్లికేషన్‌ని ఉపయోగించే ప్రతిసారీ యూఆర్ఎల్‌కు కూడా శ్రద్ధ వహించాలి. యూఆర్ఎల్ ఎలాంటి పొరపాటు లేకుండా నమోదు చేయాలి. అలాగే సోషల్ మీడియా లేదా మొబైల్ నంబర్‌లో వచ్చే ఏ అప్లికేషన్‌ను క్లిక్ చేయకూడదు. ఏ యాప్‌ను అర్థం చేసుకోకుండా డౌన్‌లోడ్ చేయకూడదు. ఐఆర్‌సీటీసీ అప్లికేషన్ మాత్రమే కాకుండా ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రభుత్వ అప్లికేషన్లు, బ్యాంక్ యాప్‌లు మోసగాళ్లు నకిలీవి సృష్టిస్తున్నారు. దీనిపై ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా ప్రజలు మోసపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్‌ని ఉపయోగించి ప్రతిరోజూ ప్రజలను మోసం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి