AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. బ్యాంకులకు వరుస సెలవులు..

ఈ నెల పండగ సీజన్‌. 12న విజయదశమి పండగను జరుపుకోనున్నారు. ఇది హిందూ మతం ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక, భారతదేశం అంతటా ఈ పండగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను అశ్వినీ మాసం శుక్ల పక్షం దశమి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం..

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌.. బ్యాంకులకు వరుస సెలవులు..
Subhash Goud
|

Updated on: Oct 11, 2024 | 3:06 PM

Share

ఈ నెల పండగ సీజన్‌. 12న విజయదశమి పండగను జరుపుకోనున్నారు. ఇది హిందూ మతం ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక, భారతదేశం అంతటా ఈ పండగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను అశ్వినీ మాసం శుక్ల పక్షం దశమి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

దసరా సందర్భంగా బ్యాంకులకు సెలవులు:

ఈ ఏడాది దసరా సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 4 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఇది కాకుండా, రాష్ట్రంలో పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా అక్టోబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. వీటిలో అన్ని ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఉన్నాయి.

దసరా సందర్భంగా బ్యాంకు సెలవుల జాబితా:

అక్టోబర్ 11: దసరా (మహాస్తమి/మహానవమి)/ఆయుధ పూజ – త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, బీహార్, జార్ఖండ్, మేఘాలయలో బ్యాంకులు మూసి ఉంటాయి.

అక్టోబరు 12: విజయదశమి (మహానవమి/విజయదశమి) – అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఎందుకంటే ఇది నెలలో రెండవ శనివారం కూడా.

అక్టోబర్ 13: ఆదివారం – అన్ని బ్యాంకులకు వారపు సెలవు.

అక్టోబర్ 14: దశైన్/దుర్గా పూజ – సిక్కింలో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఇతర ముఖ్యమైన బ్యాంకు సెలవులు:

అక్టోబర్ 16: లక్ష్మీ పూజ – త్రిపుర, బెంగాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి/కటి బిహు – కర్ణాటక, అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.

అక్టోబర్ 31: దీపావళి /కాళీ పూజ – చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఈ సెలవు దినాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా పని చేస్తాయి. అలాగే డిజిటల్ లావాదేవీలు, సేవలను ఎలాంటి ఆటంకం లేకుండా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి