AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: మస్కా.. మజాకా!.. మరో కొత్త ఆవిష్కరణ

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టెస్లా సైబర్‌క్యాబ్‌' రానే వచ్చింది. “వీ రోబోట్” కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త ఆవిష్కరణతో మరోసారి మన ముందుకు వచ్చారు. సైబర్‌క్యాబ్‌‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది స్టీరింగ్ వీల్స్, పెడల్స్ లేకుండా రూపొందించిన వాహనం కావడం విశేషం.. డ్రైవర్‌లెస్ సాంకేతికతతో ఈ వాహనం పనిచేస్తుంది.

Elon Musk: మస్కా.. మజాకా!.. మరో కొత్త ఆవిష్కరణ
Tesla Cybercab
Velpula Bharath Rao
|

Updated on: Oct 11, 2024 | 12:44 PM

Share

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టెస్లా సైబర్‌క్యాబ్‌’ రానే వచ్చింది. “వీ రోబోట్” కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త ఆవిష్కరణతో మరోసారి మన ముందుకు వచ్చారు. సైబర్‌క్యాబ్‌‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇది స్టీరింగ్ వీల్స్, పెడల్స్ లేకుండా రూపొందించిన వాహనం కావడం విశేషం.. డ్రైవర్‌లెస్ సాంకేతికతతో ఈ వాహనం పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో టెస్లా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు.

మస్క్ సైబర్‌క్యాబ్‌లో వేదికపైకి వెళ్లి, 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని, వాహనాలు $30,000 (సుమారు రూ. 25.2 లక్షలు) కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. “ఇది మాస్ ట్రాన్సిట్ కంటే చౌకగా ఉంటుంది. పర్యవేక్షించబడని, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం గల కార్లు వచ్చే ఏడాది నాటికి టెక్సాస్, కాలిఫోర్నియాలో టెస్లా మోడల్ 3 మరియు మోడల్ Yలో స్టార్టర్స్ కోసం అందుబాటులో ఉంటాయి. మోడల్ S మరియు సైబర్‌ట్రక్ కూడా అందుబాటులో ఉంటాయి. పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన స్వీయ-డ్రైవింగ్ కోసం అనుకూలీకరించిన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుంది” అని చెప్పుకొచ్చారు.

కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్‌లో హై-టెక్ స్టేజింగ్, వైబ్రెంట్ లైటింగ్‌తో జరిగిన ఈ ఈవెంట్, కృత్రిమ మేధస్సుతో నడిచే ప్రపంచాన్ని సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లు టెస్లా చెప్పుకొచ్చింది. . “మేము భవిష్యత్ ప్రపంచాన్ని సృష్టించాము,” అని మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈవెంట్ గూర్చి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ‘టెస్లా సైబర్‌క్యాబ్‌’ సంబంధించిన ఫోటో నెటింట్లో వైరల్‌గా మారాయి.