Ratan Tata: రతన్ టాటా గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
టాటా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్న రతన్ టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా..
టాటా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్న రతన్ టాటా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. అతనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.
రతన్ టాటాకు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు:
- రతన్ నావల్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో నావల్ టాటా, సునీ టాటా దంపతులకు జన్మించారు. అతను జమ్‌సెట్‌జీ టాటాకి ముని మనవడు. టాటా గ్రూప్‌ని స్థాపించింది ఆయనే.
- రతన్ టాటా ప్రారంభ విద్యాభ్యాసం ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌లో జరిగింది. ఇక్కడ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. దీని తరువాత జాన్ కన్నన్ స్కూల్ (ముంబై), బిషప్ కాటన్ స్కూల్ (సిమ్లా), రివర్‌డేల్ కంట్రీ స్కూల్ (న్యూయార్క్) నుండి తదుపరి విద్యనభ్యసించారు.
- 1959లో న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. దీని తర్వాత రతన్ టాటా 1961లో టాటా స్టీల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు.
- రతన్ టాటా తల్లిదండ్రులు 1948లో విడిపోయారు. దీని తర్వాత అతని అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా అతన్ని పెంచారు. అతని పెళ్లి గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ రతన టాటా చివరకు పెళ్లి చేసుకోలేదు.
- ఒక ఇంటర్వ్యూలో అతను లాస్ ఏంజిల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని, అయితే 1962లో జరుగుతున్న ఇండియా-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు తనను భారతదేశానికి పంపేందుకు నిరాకరించారని చెప్పారు.
- 1991లో ఆటో స్టీల్ గ్రూప్ ఛైర్మన్‌గా అయ్యారు. అతను 2012 వరకు ఈ గ్రూప్‌ను నడిపాడు. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ జరుగుతున్న సమయంలో ఆయన టాటా గ్రూప్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించారు.
- టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్ల వ్యాపార విస్తరణలో రతన్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు. జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కూడా కొనుగోలు చేశాడు.
- 2009లో రతన్ టాటా మధ్యతరగతి ప్రజల కోసం ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు నానోను విడుదల చేశారు. ఈ కారు ధర లక్ష రూపాయలు.
- భారత ప్రభుత్వం 2008లో రతన్ టాటాకు పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రతన్ టాటా 2012 లో తన పదవి విరమణ చేశారు. ఆ తర్వాత అతను టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌కు గౌరవ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు.
- రతన్ టాటా చదువుతున్నప్పుడు సంగీత విద్వాంసులు జుబిన్ మెహతా, వ్యాపారవేత్తలు అశోక్ బిర్లా, రాహుల్ బజాజ్, డ్యూక్ యజమాని దిన్‌షా పండోల్ వంటి చాలా మంది పెద్ద పెద్ద వారు కూడా రతన్ టాటాకి క్లాస్‌మేట్స్. అలాగే రతన్ టాటా బయటకు వెళ్లినప్పుడు సామాస్యులను కూడా పలకరించే మనస్సు. రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారులను సైతం పలకరించేవారట.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి