Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అలెర్ట్.. ఆ పెట్టుబడి కోసం ఖాతా తప్పనిసరి

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్థిర ఆదాయ పథకాలు కాకుండా ఎక్కువ రాబడినిచ్చే వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడి విషయానికి వస్తే వారి రాబడిని పెంచుకోవాలనుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పెట్టుబడులకు కొన్ని రకాల ఖాతాలు అవసరమని చాలామంది అనుకుంటారు. అయితే వాస్తవంలో మాత్రం ప్రత్యేక ఖాతాలు అవసరం ఉండవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు అలెర్ట్.. ఆ పెట్టుబడి కోసం ఖాతా తప్పనిసరి
Systematic Investment Plan(sip)
Follow us

|

Updated on: Oct 11, 2024 | 3:36 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారాయి. పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్థిర ఆదాయ పథకాలు కాకుండా ఎక్కువ రాబడినిచ్చే వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడి విషయానికి వస్తే వారి రాబడిని పెంచుకోవాలనుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పెట్టుబడులకు కొన్ని రకాల ఖాతాలు అవసరమని చాలామంది అనుకుంటారు. అయితే వాస్తవంలో మాత్రం ప్రత్యేక ఖాతాలు అవసరం ఉండవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచాలని చూస్తున్న వారైతే మ్యూచువల్ ఫండ్స్‌లో అవాంతరాలు లేని పెట్టుబడి కోసం ఉన్న వివిధ ఎంపికలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్‌లు, బాండ్‌లు లేదా ఇతర సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి వివిధ పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరిస్తుంది. ప్రతి పెట్టుబడిదారుడు వారి పెట్టుబడి ఆధారంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి కీలకమైన డీ-మ్యాట్ ఖాతా అవసరమా? అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో డీ-మ్యాట్ ఖాతా అవసరమో? కాదో? ఓ సారి తెలుసుకుందాం.

డీమ్యాట్ ఖాతా అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. స్టాక్‌లు, బాండ్‌లు, ఇతర ఆర్థిక సాధనాల వంటి సెక్యూరిటీల ఎలక్ట్రానిక్ హోల్డింగ్, ట్రేడింగ్ కోసం ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఖాతా. స్టాక్ మార్కెట్‌లో పాల్గొనడానికి, సెక్యూరిటీలలో వ్యాపారం చేయాలనుకునే పెట్టుబడిదారులకు ఈ ఖాతా అవసరం. ఈ నేపథ్యంలో మీకు డీమ్యాట్ ఖాతా లేకుంటే మీరు స్టాక్‌బ్రోకర్ లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్‌తో ద్వారా ఖాతాను తెరవాల్సి ఉంటుంది.  చాలా బ్రోకరేజ్ సంస్థలు డీమ్యాట్ ఖాతాతో పాటు ట్రేడింగ్ ఖాతాను అందిస్తాయి. ఇది మ్యూచువల్ ఫండ్‌లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. డీ-మ్యాట్ ఖాతాను సెటప్ చేసిన తర్వాత బ్రోకర్ ప్లాట్‌ఫారమ్‌కు లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి  మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.

డీ-మ్యాట్ ఖాతా ద్వారా మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)ని ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు మీ డీమ్యాట్ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. మీరు వాటిని బ్రోకర్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా పర్యవేక్షించవచ్చు. డీమ్యాట్ ఖాతాకు వార్షిక నిర్వహణ రుసుములు, లావాదేవీల రుసుములు, బ్రోకరేజ్ ఛార్జీలు ఉంటాయి. మీరు మ్యూచువల్ ఫండ్ ప్రొవైడర్ వెబ్‌సైట్ లేదా థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి డీమ్యాట్ ఖాతా లేకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఇలాంటి చార్జీలు ఉండవు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి