AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Single Premium Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరే ప్లాన్.. సింగిల్ ప్రీమియంతో భలే ప్రయోజనాలు..

భారతీయ జీవిత బీమా సంస్థ తీసుకువచ్చిన సింగిల్ ప్రీమియం గ్రూప్ మైక్రో టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ 2024 అక్టోబర్ 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, గ్రూప్ ప్యూర్ ఇన్స్యూరెన్స్ కోసం దీన్ని రూపొందించారు. సూక్ష్మ ఫైనాన్స్ సంస్థలు, కో ఆపరేటివ్ లు, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులకు బీమా కవరేజీని అందిస్తుంది.

LIC Single Premium Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరే ప్లాన్.. సింగిల్ ప్రీమియంతో భలే ప్రయోజనాలు..
Lic Policies
Madhu
|

Updated on: Oct 11, 2024 | 8:22 AM

Share

జీవితం సుఖంగా, సాఫీగా, ఇబ్బందులు లేకుండా సాగిపోవడానికి ప్రతి ఒక్కరూ అనేక ప్రణాళికలు వేసుకుంటారు. భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వాటి ఎదుర్కోవడానికి ముందు నుంచే సిద్ధంగా ఉంటారు. జీవితానికి అన్ని విధాలా భద్రత ఉండేలా చూసుకుంటారు. ఇందుకోసం పాలసీలను తీసుకుంటారు. వీటిలో బీమా, ఆరోగ్యం తదితర అనేక రకాలు ఉంటాయి. బీమా పాలసీలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). దేశంలో దాదాపు ప్రజలందరికీ తెలిసిన సంస్థ ఇదే. ఈ కంపెనీ ద్వారా ప్రజలకు అవసరమైన వివిధ రకాల పాలసీలు అమలవుతున్నాయి. అయితే ఎల్ఐసీ కొత్తగా సింగిల్ ప్రీమియం గ్రూప్ మైక్రోె టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అనే పాలసీని తీసుకువచ్చింది. వివిధ సంస్థలు, సంఘాల సభ్యులకు జీవిత బీమా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం

సింగిల్ ప్రీమియం బీమా..

భారతీయ జీవిత బీమా సంస్థ తీసుకువచ్చిన సింగిల్ ప్రీమియం గ్రూప్ మైక్రో టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ 2024 అక్టోబర్ 7వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, గ్రూప్ ప్యూర్ ఇన్స్యూరెన్స్ కోసం దీన్ని రూపొందించారు. సూక్ష్మ ఫైనాన్స్ సంస్థలు, కో ఆపరేటివ్ లు, స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులకు బీమా కవరేజీని అందిస్తుంది. సంఘంలోని సభ్యులందరికీ సౌకర్యవంతంగా బీమాను అందించడమే ఈ పాలసీ లక్ష్యం. సంఘాలు, సంస్థలకు చెందిన సభ్యులు, రుణగ్రహీతలకు బీమా అందించడానికి చూస్తున్న ఆర్థిక సంస్థలకు చాాలా ఉపయోగంగా ఉంటుంది. అసంఘటిత సమూహాలు, యజమాని – ఉద్యోగి సమూహాలకు చెందిన వారికి బీమా అవసరాలను తీర్చుతుంది.

ఎంతో ఉపయోగం..

మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్ఐలు), సహకార సంస్థలు, స్వయం సహాయక బందాలు (ఎస్‌హెచ్‌జీలు), ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) తదితర వాటి కోసం ఎల్ ఐసీ కొత్త ప్లాన్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వాటిలోని సభ్యులు, రుణగ్రహీతలకు బీమా అందించే అవకాశం కలుగుతుంది. బీమా తీసుకున్న సభ్యులు అనుకోకుండా మరణించిన సందర్భంలో బకాయి ఉన్న రుణాలను తీర్చడానికి ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. సభ్యుల కుటుంబాలకు అండగా ఉంటుంది.

నిబంధనలు ఇవే..

కనీసం 50 సభ్యులు ఉన్న సంఘాలు, సంస్థలకు ఎల్ ఐసీ కొత్త పాలసీ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ పాలసీ కింద రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకూ హామీ లభిస్తుంది. పాలసీ టర్మ్ ప్రారంభంలో ఒకేసారి ప్రీమియం చెల్లిస్తారు. పాలసీదారులకు ఏడాది నుంచి పదేళ్ల వరకూ కవరేజీ అందుతుంది. దేశంలో బీమా తీసుకోని జనాభాకు తక్కువ ధరకు కవరేజీ అందుతుంది. ముఖ్యంగా అకాల మరణాల విషయంలో ప్రజలు ఆర్థిక రక్షణ పొందటానికి ఉపయోగపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..