AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రతన్ టాటాకు తెలుగింట ఘన నివాళి.. జీవిత చరిత్రను అద్భుతంగా మలిచిన సూక్ష్మ కళాకారుడు

ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు. మహనీయుడిని కోల్పోయి దిగ్భ్రాంతికి గురవుతోంది భారతావని. అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకుని విభిన్న రీతిలో నివాళ్లులర్పిస్తున్నారు.

రతన్ టాటాకు తెలుగింట ఘన నివాళి.. జీవిత చరిత్రను అద్భుతంగా మలిచిన సూక్ష్మ కళాకారుడు
Ratan Tata Art
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Oct 11, 2024 | 8:05 AM

Share

రతన్‌ టాటా కాదు ఆయన ‘రత్న’ టాటా. పుట్టుక పార్సీ అయినా పదహారణాల భారతీయుడు. స్కూల్‌ పుస్తకాల్లో కచ్చితంగా ఉండాల్సిన ఓ పాఠ్యాంశం. నిఖార్సైన దేశభక్తుడు. దేశభక్తినంతటినీ త్రాసులో ఓవైపు పెట్టి, రతన్‌ టాటాను మరోవైపు కూర్చోబెడితే మొగ్గు టాటా వైపే ఉంటుంది. అసలైన ఆనందానికి పేరు.. రతన్‌ టాటా. ఈ దేశంలో వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో బోలెడు మంది ఉన్నారు. కానీ రతన్ టాటా లాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.

అంతటి మహనీయుడిని కోల్పోయి దిగ్భ్రాంతికి గురవుతోంది భారతావని. అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకుని విభిన్న రీతిలో నివాళ్లులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్.. రతన్ టాటా మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయన జీవత చరిత్ర పై ఓ చిత్రాన్ని గీసి చిత్రనివాళి అర్పించారు. డ్రాయింగ్ సీట్ పై ఎటు వంటి గీతలు లేకుండా తెలుగు, ఇంగ్లీషు అక్షరాలతో అయన జీవిత చరిత్రను మైక్రో పెన్నుతో ఎంతో అద్బతంగా చిత్రకారుడు కోటేష్ వేశారు‌. దాదాపుగా మూడు గంటలపాటు శ్రమించి రతన్ టాటా సజీవంగా జీవించి ఉండేలా అయన చిత్రాన్ని ఎంతో అద్బతంగా గీశారు.

వీడియో చూడండి…

దేశంలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి, ఎంతో మంది యువతీయువకులకు ఉపాధి అవ కల్పించిన మహానీయుడు రతన్ టాటా అంటూ కోటేష్ కొనియాడారు. ఎంత ఎదిగిన ఒదిగి వుండే మహోన్నత వ్యక్తి అని, అంచెలంచెలుగా ఎదిగి మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని చిత్రకారుడు కోటేష్ తెలిపారు. మహమ్మారి కరోనాతో దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ 1,500 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన మహాదాత, అపారమైన దేశభక్తి కలిగిన రతన్ టాటా భారతీయుడుగా పుట్టతం మన అదృష్టం అని గుర్తు చేసుకున్నారు. అయన మరణం దేశానికి తీర లోటు అని అవేధన వ్యక్తం చేశారు‌. చిత్రకారుడిగా అతని సేవలు స్మరిస్తూ అతని చిత్రాన్ని గీసి నివాళి అర్పించడం తన అదృష్టంగా భావిస్తూన్నాని చిత్రకారుడు కోటేష్ తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?