Viswam Movie Review: ‘విశ్వం’ సినిమా రివ్యూ.. గోపిచంద్, శ్రీను వైట్ల కాంబో వర్కవుట్ అయ్యిందా..?

శీను వైట్ల నుంచి సరైన సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటింది.. అలాగే గోపీచంద్ నుంచి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విశ్వం సినిమా చేశారు. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Viswam Movie Review: 'విశ్వం' సినిమా రివ్యూ.. గోపిచంద్, శ్రీను వైట్ల కాంబో వర్కవుట్ అయ్యిందా..?
Gopichand
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Oct 11, 2024 | 1:04 PM

మూవీ రివ్యూ: విశ్వం

నటీనటులు: గోపీచంద్, కావ్య తపర్, కిక్ శ్యామ్, ముఖేష్ ఋషి, నరేష్, ప్రియా వడ్లమాని, ప్రగతి, సునీల్, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: కేవీ గుహ

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

కథ, మాటలు, దర్శకత్వం: శ్రీను వైట్ల

శీను వైట్ల నుంచి సరైన సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటింది.. అలాగే గోపీచంద్ నుంచి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి విశ్వం సినిమా చేశారు. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

హైదరాబాద్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దాని వెనక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఖురేషి (డిష్ సెన్ గుప్తా) ఉంటాడు. అతడికి సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు బాచి రాజు (సునీల్) హెల్ప్ చేస్తాడు. ఈ విషయం మినిస్టర్ (సుమన్) కు తెలియడంతో ఇద్దరు కలిసి అతన్ని చంపేస్తారు. దాన్ని ఒక పాప చూస్తుంది. దాంతో ఆ పాపను చంపాలని మనుషుల్ని పంపిస్తాడు ఖురేషి. అదే సమయంలో గోపి అలియాస్ విశ్వం (గోపీచంద్) వచ్చి ఆ పాప ప్రాణాలు కాపాడుతాడు. అప్పటినుంచి ఆ పాపకు అంగరక్షకుడిగా ఉంటాడు. ఆ పాపను విశ్వం కాపాడాడా లేదా..? ఈ కథలోకి సమైరా (కావ్య థాపర్) ఎందుకు వచ్చింది..? టెర్రరిస్ట్ ను విశ్వం పట్టుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ..

కథనం:

దేశం.. దేశాన్ని కాపాడే సైనికుడు.. ఒక టెర్రరిస్ట్.. ఇండియాలో నాశనం చేయాలి అనేది అతడి లక్ష్యం.. దానికోసం ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడే హీరో.. సింపుల్ గా చెప్పాలంటే విశ్వం స్టోరీ లైన్ ఇదే. తెలుగు సినిమాలో ఈ కథతో ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాలు వచ్చాయి. శీను వైట్ల మరోసారి ఇదే కథతో వచ్చాడు. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాడు. అసలేమాత్రం అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సినిమా ఏ మాత్రం బాగున్నా నచ్చుతుంది. ఈ విషయంలో పదేళ్ల తర్వాత శీను వైట్ల కాస్తో కూస్తో సక్సెస్ అయ్యాడు. తనకు తెలిసిన కామెడీ ఫార్మేట్ లోకి వచ్చి విశ్వం చేశాడు. టైటిల్ కార్డు పడినప్పుడే ఎండ్ కార్డ్ అర్థమయిపోతుంది.. అంత రొటీన్ కథ. అందుకే తన కథనంతో ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు శీను వైట్ల. ఫస్టాఫ్ చాలా వరకు ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోయింది. ముఖ్యంగా 30 ఇయర్స్ పృథ్వి చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వించాడు. జాలి రెడ్డిగా మనోడు వేసిన డైలాగ్స్ కడుపులు చెక్కలు చేస్తాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి.

సెకండ్ హాఫ్ కాస్త డల్ అయింది.. అందుకే వెన్నెల కిషోర్ కు ఆ బాధ్యత ఇచ్చాడు శ్రీను వైట్ల. ట్రైన్ ఎపిసోడ్ అంతా వెంకీ సినిమాను గుర్తు చేస్తుంది. దాంతో పాటు దూకుడు, బాద్షా ఇలా అన్ని మధ్య మధ్యలో అలా వచ్చి వెళుతుంటాయి. వీటివి గణేష్, వెన్నెల కిషోర్ బాగానే నవ్వించారు. క్లైమాక్స్ కాస్త ల్యాగ్ అయింది.. దానికి తోడు రొటీన్ కథ కావడం మరింత మైనస్. లాజిక్స్ వెతకకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే విశ్వం నచ్చుతాడు.

నటీనటులు:

గోపీచంద్ ఇటు కామెడీ.. అటు యాక్షన్ బాగా చేశాడు. కావ్య తాపర్ గ్లామర్ షోకే పరిమితం అయిపోయింది. ఫస్ట్ అఫ్ అంతా 30 ఇయర్స్ పృథ్వి చూసుకున్నాడు. సెకండ్ ఆఫ్ వెన్నెల కిషోర్ డ్యూటీ ఎక్కాడు. మిగిలిన వాళ్ళంతా వాళ్లకు సపోర్ట్ చేశారు. కిక్ శ్యామ్, జిస్సు సేన్ గుప్తా తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నికల్ టీం:

చేతన్ భరద్వాజ్ సంగీతం పర్లేదు. ఎడిటింగ్ సెకండ్ ఆఫ్ కొన్ని సీన్స్ తీసేయాల్సింది. కానీ దర్శకుడు శ్రీనువైట్ల నిర్ణయం కాబట్టి ఏమీ చేయలేము. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు పర్లేదు. శీను వైట్ల అద్భుతం అయితే చేయలేదు కానీ.. చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ అయితే చూపించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా విశ్వం.. అంచనాలు లేకుండా వెళ్తే నవ్వుకుంటారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
అశ్విన్‌కు లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. మొత్తం ఆస్తి ఎంతంటే?
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్.. ఆ గడువు మరో నెల రోజుల పెంపు
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
భారత్‌లో పెరుగుతున్న షుగర్ పేషెంట్స్.. నిపుణుల సలహా ఏమిటంటే
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
త్రుట్టిలో తప్పించుకున్న రోహిత్.. జర్రుంటే చిక్కుల్లో పడేవాడు..!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా.? తక్కువ ధరలో ది బెస్ట్స్ ఇవే.!
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
మహేశ్ బాబు- రాజమౌళి సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
వీళ్ళేం దొంగలురా సామీ.. వాటిని కూడా వదల్లేదు..!
సొమ్ములు మీవైతే షాపింగ్ వేరే వారిది..!
సొమ్ములు మీవైతే షాపింగ్ వేరే వారిది..!
పవన్ కళ్యాణ్‌ గోల్డెన్ టైమ్.. గ్లోబల్ వైడ్‌గానూ పవన్ ట్రేండింగ్.!
పవన్ కళ్యాణ్‌ గోల్డెన్ టైమ్.. గ్లోబల్ వైడ్‌గానూ పవన్ ట్రేండింగ్.!
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా