Gold Price: వామ్మో.. ఒక్క రోజులోనే ఇంత పెరిగిందా? పండగకు ముందు భారీగా పెరిగిన బంగారం ధర!

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. పండగలకు ముందు కాస్త దిగి వస్తుందోమోనని ఆశగా ఎదురు చూసిన మహిళలకు నిరాశ ఎదురవుతోంది. అయినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది గోల్డ్‌ ధర. నిన్న అంటే అక్టోబర్‌ 10వ..

Gold Price: వామ్మో.. ఒక్క రోజులోనే ఇంత పెరిగిందా? పండగకు ముందు భారీగా పెరిగిన బంగారం ధర!
Gold
Follow us

|

Updated on: Oct 11, 2024 | 4:05 PM

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. పండగలకు ముందు కాస్త దిగి వస్తుందోమోనని ఆశగా ఎదురు చూసిన మహిళలకు నిరాశ ఎదురవుతోంది. అయినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది గోల్డ్‌ ధర. నిన్న అంటే అక్టోబర్‌ 10వ తేదీన ఉదయం తులం బంగారం ధర రూ.76,640 ఉండగా, ప్రస్తుతం అంటే అక్టోబర్‌ 10వ తేదీ సాయంత్రం 4 గంటల సమయానికి తులం ధర రూ.77,400 వద్ద ఉంది. అంటే ఒక రోజులోనే 760 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం సాయంత్రం 4 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,400 ఉంది.

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఇతర లోహాలు కలిపి ఉండవు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల బంగారం:

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహాలు ఉంటాయి. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది. దీంతో ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

డిమాండ్, వడ్డీ వసూలు, ఆక్ట్రాయ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ సంఘాలు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ అంశాల కారణంగా బంగారం ధరలు నగరం నుండి నగరానికి మారవచ్చు. అన్ని నగరాల్లో ఒకే ధర ఉండకపోవచ్చని గుర్తించుకోండి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Ratan Tata: రతన్‌ టాటా గురించి ఈ 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి