Airtel Plan: డైలీ రూ.10 కూడా ఉండదు.. 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ఈ ప్లాన్ రోజువారీ 100 ఉచిత SMSలను కూడా అందిస్తుంది. 5G కవరేజీ ప్రాంతంలో ఉన్న 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్..
టెలికాం రంగంలో పోటీ నెలకొంది. జియో, ఎయిర్‌టెల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. వినియోగదారులను పెంచుకునేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్‌టెల్ ఇటీవల తన 350 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్‌ణు ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం (365 రోజుల) చెల్లుబాటును అందిస్తుంది. అలాగే అపరిమిత 5G ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఫలితంగా ఇది Jio, BSNLకు దీర్ఘకాలిక వ్యాలిడిటీ పోటీని అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? వెల్లడించిన నీతా అంబానీ!
భారతి ఎయిర్‌టెల్ నుండి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2GB రోజువారీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. మొత్తం సంవత్సరం మొత్తం మీద 720GB లభిస్తుంది. ఈ గణనీయమైన డేటా ఆఫరింగ్‌తో పాటు, ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనంతో పాటు దేశవ్యాప్తంగా ఏదైనా టెలికాం నెట్‌వర్క్‌కి వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఇది కూడా చదవండి: Jio Plan: జియో చౌకైన ప్లాన్.. రూ.175తో 10 జీబీ డేటా, 11 ఓటీటీ యాప్స్!
ఇంకా ఈ ప్లాన్ రోజువారీ 100 ఉచిత SMSలను కూడా అందిస్తుంది. 5G కవరేజీ ప్రాంతంలో ఉన్న 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అపరిమిత 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 3,599.
అదనంగా ఎయిర్‌టెల్ మూడు కొత్త డేటా రీఛార్జ్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. వినియోగదారులు వారి రోజువారీ డేటా అయిపోయిన తర్వాత కూడా ప్రయోజనాలను అందిస్తూనే ఉంటుంది. రూ. 161,రూ.181, రూ.351 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్‌లు 50GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తాయి.
ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి