Stock market: లాభాలను తెచ్చిపెట్టే బెస్ట్ స్టాక్ లు ఇవే.. వీటిలో డబ్బులు పెడితే రాబడి పరుగులే..!
ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందటానికి అవకాశం ఉండడంతో రిస్క్ ఉన్నప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వివిధ కంపెనీల స్టాక్ లు అమ్మడం, కొనడంలో బిజీ అవుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వారికి వివిధ కంపెనీల స్టాక్ లపై కనీస అవగాహన అవసరం. కొందరు విశ్లేషకులు తాజాాగా అందుబాటులో ఉన్న కొన్ని స్టాక్ లను సిఫారసు చేస్తున్నారు. వాటి రాబడిని కూడా అంచనా వేసి చెబుతున్నారు. ఆ ప్రకారం.. 16 శాతం నుంచి 29 శాతం మధ్య రాబడినిచ్చే స్టాక్ ల వివరాలు ఇవీ..
డాబర్
ఈ సంస్థ స్టాక్ లకు నోమురా సంస్థ బ్రోకరేజ్ చేస్తోంది. డాబర్ స్టాక్ ధర ప్రస్తుతం రూ.543 ఉంది. భవిష్యత్తులో రూ. 650 పెరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ధర తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. రిస్క్ తో పాటు రివార్డుకు అవకాశం ఉంది. డాబర్ లిమిటెల్ అనేది భారతీయ బహుళజాతి కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ. ఈ సంస్థను ఎస్కే బర్మన్ స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయంలో ఘజియాబాద్ లో ఉంది. ఆయుర్వేద వైద్యం, వినియోగదారుల ఉత్పత్తులను తయారు చేస్తుంది. దేశంలోని అతి పెద్ద మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల్లో ఇది ఒకటి.
ఆదిత్య బిర్లా క్యాపిటల్
ఇన్వెస్టిక్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా ఈ కంపెనీ స్టాక్ ల లావాదేవీలు జరపొచ్చు. ప్రస్తుతం స్టాక్ ధర రూ.206 కాగా.. రాబోయే రోజుల్లో రూ.265కి పైగా పెరిగే అవకాశం ఉంది. మూడు సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీసీఎల్)కు చెందిన అనుబంధ సంస్థలు రక్షణ, పెట్టుబడి, ఫైనాన్సింగ్ రంగాలలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. వీటికి దేశవ్యాప్తంగా 1048 శాఖలు ఉన్నాయి.
ప్రెస్టీజ్ ఎస్టేట్
ప్రెస్టీజ్ ఎస్టేట్ కు చెందిన స్టాక్ లు కూడా మంచి రాబడిని ఇస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేపీ మోర్గాన్ బ్రోకరేజ్ సంస్థ ఈ స్టాక్ లావాదేవీలు నిర్వహిస్తోంది. ప్రెస్టీజ్ ఎస్టేట్ స్టాక్ ధర (సీఎంపీ) రూ.1638 ఉంది. ఈ ధర రూ.1900కు పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దేశంలోని 12 కంటే ఎక్కువ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిటైల్, హాస్పిటాలిటీ, ప్రాపర్టీ మేనేజ్ మెంట్, వేర్ హౌస్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
నైకా
జెఫిరీస్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. నైకా కంపెనీ స్టాక్ ధర ప్రస్తుతం రూ.184.15గా ఉంది. భవిష్యత్తులో రూ.220కి చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యూటీ, వ్యక్తిగత ఉత్పత్తులపై (బీపీసీB) దృష్టి పెట్టడం వల్ల స్టాక్ లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ముంబై కేంద్రంగా నైకా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెబ్ సైట్, మొబైల్ యాప్, దేశంలోని దాదాపు 100 దుకాణాల ద్వారా బ్యూటీ, వెల్నెస్, ఫ్యాఫన్ ప్రోడక్టులు విక్రయిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి