AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US President Salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా? ఇంకా బెనిఫిట్స్‌ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు!

US President Salary: అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరు ఉండటంతో ఇక్కడి అధ్యక్షుడికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. జీతంతో పాటు, అమెరికన్ ప్రెసిడెంట్‌కి మొదటిసారిగా

US President Salary: అమెరికా అధ్యక్షుడి జీతం ఎంతో తెలుసా? ఇంకా బెనిఫిట్స్‌ ఏంటో తెలిస్తే అవాక్కవుతారు!
Subhash Goud
|

Updated on: Nov 06, 2024 | 5:00 PM

Share

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు పేరుంది. అందుకే ఈ దేశ అధ్యక్షుడికి అత్యంత శక్తిమంతుడి హోదా కూడా వస్తుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అమెరికాలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించారు. 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ దేశంలో అధ్యక్షుడి పదవీకాలం 4 సంవత్సరాలు. అమెరికా కొత్త అధ్యక్షుడు జనవరి 20, 2025న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈసారి ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు కాలేదు.

అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పేరు ఉండటంతో ఇక్కడి అధ్యక్షుడికి ఎంత జీతం లభిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. జీతంతో పాటు, అమెరికన్ ప్రెసిడెంట్‌కి మొదటిసారిగా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే సమయంలో పన్ను రహిత ఖర్చులు, వినోద ఖర్చులతో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

అమెరికా అధ్యక్షుని వార్షిక ఆదాయం:

  • జీతం: రూ. 3.36 కోట్లు
  • ఖర్చులకు అదనపు భత్యం: రూ. 42 లక్షలు (50000 వేల డాలర్లు)
  • పన్ను రహిత వ్యయం: రూ. 84 లక్షలు ($100,000)
  • వినోదం కోసం ఖర్చులు: 42 లక్షల రూపాయలు (50000 వేల డాలర్లు)
  • వైట్ హౌస్‌లో మొదటిసారిగా ఇచ్చిన భత్యం: రూ. 84 లక్షలు ($100,000)
  • అన్ని ఇతర సౌకర్యాలు కూడా ఉచితం

వార్షిక జీతం, అలవెన్సులతో పాటు అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్ లో అన్ని సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. దీనితో పాటు, వారు ఇతర దేశాలకు ప్రయాణించడానికి/పర్యటనలకు ఒక లిమోసిన్ కారు, ఒక మెరైన్ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ వన్ అనే విమానం కూడా పొందుతారు. దీనితో పాటు, వారి భద్రతను కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 2001 నుంచి అమెరికాలో అధ్యక్షుడి జీతం పెరగలేదు. అమెరికాలో అధ్యక్షుడి జీతం చివరిసారిగా జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారంలోకి వచ్చినప్పుడు పెరిగింది. అంతకు ముందు అమెరికాలో అధ్యక్షుడి జీతం 200,000 డాలర్లు. అమెరికాలో 1789 తర్వాత, 1873, 1909, 1949, 1969, 2001లో జీతాలు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి