AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? వెల్లడించిన నీతా అంబానీ!

ముఖేష్ అంబానీ డైట్ చార్ట్ శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా అతని మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఆహారాలను తీసుకుంటారట. ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు సులభంగా ఉంటుంది..

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? వెల్లడించిన నీతా అంబానీ!
Subhash Goud
|

Updated on: Nov 06, 2024 | 1:34 PM

Share

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. అయితే ఇంత ధనవంతుడు అయినప్పటికీ అతని జీవనశైలి, ఆహారం చాలా సింపుల్ గా ఉంటాయని మీకు తెలుసా? ఆరోగ్యకరమైన ఆహార నియమాలను అనుసరిస్తుంటారు. ముఖేష్ అంబానీ డైట్ ప్లాన్ గురించి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ముఖేష్ అంబానీ ఉదయం 5:30 గంటలకు నిద్రలేచిన తర్వాత చాలా తేలిక అల్పాహారం తీసుకుంటారని, అల్పాహారం సాధారణంగా తాజా పండ్లు, రసాలతో పాటు ఇడ్లీ, సాంబార్ వంటి సాంప్రదాయ దక్షిణ భారతీయ పదార్థాలను ఇష్టపడతారని తెలిపారు. ముఖేష్ అంబానీ ఆల్కహాల్, జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారని, వారానికి ఒకసారి మాత్రమే బయటి ఫుడ్ తినేందుకు ఇష్టపడతారని తెలిపారు. కేవలం ఇంట్లో వండి ఆహారాన్ని ఇష్టపడతారని తెలిపారు.

శాఖాహారం మాత్రమే..

ఇవి కూడా చదవండి

ముఖేష్ అంబానీ సాంప్రదాయ గుజరాతీ వంటకాలను కలిగి ఉన్న శాఖాహార ఆహారాన్ని తీసుకుంటారు. వారి భోజనంలో సాధారణంగా పప్పులు, బియ్యం, వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. సలాడ్‌లు, సూప్‌లపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.

మానసిక ఆరోగ్యం కోసం..

ముఖేష్ అంబానీ డైట్ చార్ట్ శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా అతని మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేసే ఆహారాలను తీసుకుంటారట. ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు సులభంగా ఉంటుంది. అంబానీ తినే ఆహారాల్లో తక్కువ నూనె, నెయ్యిలతో తయారు చేస్తారు. అంబానీకి గుజరాతీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన చిరుతిళ్లలో ఒకటి అరటి ఆకుల మధ్య వండిన బియ్యపు పిండితో చేసిన పాంకీ. ఇది ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. మెంతి ఆకులు, పసుపు, కొద్దిపాటి సుగంధ ద్రవ్యాలు పాంకి పోషణను మెరుగుపరుస్తాయి. పాంకీని ఊరగాయ లేదా చట్నీతో తినవచ్చు, ఇది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి.

ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్‌.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి