- Telugu News Photo Gallery If you use almond oil like this you will glow beautifully, Check Here is Details in Telugu
Winter Skin Care: ఈ సీజన్‌లో బాదాం నూనెను ఇలా వాడితే మెరిసిపోతారు..
ఇతర సీజన్స్ కంటే ఈ సీజన్‌లో చర్మ పరంగా చాలా కేర్ తీసుకోవాలి. కేవలం పెద్దలే కాకుండా చిన్న పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎక్కువగా చర్మం పొడిబారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే.. ఈ కింద చెప్పిన విధంగా చేయండి..
Updated on: Nov 06, 2024 | 1:19 PM

చలి కాలంలో ఎంత కేర్ తీసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కామన్. ఎక్కువగా చలి కాలంలో చర్మం తర్వగా పొడిబారిపోతుంది. వాతావరణంలోని తేమ కారణంగా ఇలా జరుగుతుంది. శీతాకాలంలో కూడా చర్మం పొడిబారకుండా అందంగా ఉండాలంటే ఇలా చేయండి.

బాదం నూనె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వింటర్‌లో వచ్చే చర్మ సమస్యలను కంట్రోల్ చేయడంలో ఈ నూనె ఎంతో హెల్ప్ చేస్తుంది. బాదం నూనె రాయడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

రాత్రి పూట నిద్రించే ముందు బాదం నూనెతో శరీరం అంతా మర్దనా చేసుకోవాలి. ముఖం నుంచి పాదాల వరకు రాసుకోవాలి. అనంతరం ఉదయం స్నానం చేస్తే సరిపోతుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.

బాదం నూనె చర్మానికి రాసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేట్ అవ్వడమే కాకుండా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ నూనె మాయిశ్చరైజర్‌లా కూడా పని చేస్తుంది. కాబట్టి మళ్లీ మరు స్కిన్‌కి ఇతర క్రీములు వాడాల్సిన పని లేదు.

డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి బాదం నూనె కళ్ల కింద రాసి.. సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేస్తే వారంలోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం నూనెలో నిమ్మరసం, తేనె కలిపి రాస్తే ట్యాన్ మొత్తం పోతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




